కొడుకు కోసం తల్లడిల్లిన తల్లి.. విదేశాల నుంచి రాలేదని ఆత్మహత్య

విదేశాల్లో ఉన్న కుమారుడు లాక్‌డౌన్‌ వల్ల ఇంటికి రాలేకపోవడంతో మనోవేదనకు గురైన ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లక్ష్మి, బాలరాజు దంపతులు కొన్నాళ్లుగా చిక్కడపల్లి వివేక్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరి కుమారుడు సతీష్‌కుమార్‌ కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. మార్చి నెలలో హైదరాబాద్‌ వస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆనందంతో ఉప్పొంగిపోయారు.

Also Read:

అయితే ఈలోగానే లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో సతీశ్‌కుమార్ స్వదేశానికి వచ్చేందుకు ఆటంకం ఏర్పడింది. దీంతో లక్ష్మి కొడుకుపై బెంగ పెట్టుకుంది. ఎలాగైనా ఇంటికి వచ్చేయాలంటూ కొడుకును కోరేది. అయితే విమాన రాకపోకలు నిలిచిపోవడంతో తాను రాలేకపోతున్నానని, లాక్‌డౌన్ ఎత్తేయగానే వస్తానని సతీశ్ తల్లిని సముదాయిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే పొలం పనులు చూసుకోవడానికి బాలరాజు రాజన్న సిరిసిల్లలోని స్వగ్రామానికి రెండ్రోజుల క్రితం వెళ్లాడు. దీంతో ఒంటరిగా ఉన్న లక్ష్మి మనస్తాపానికి గురై బుధవారం తెల్లవారుజామున విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here