కూతురు గొంతుకోసిన తండ్రి.. సంగారెడ్డిలో దారుణం.. ఆకలి బాధలే కారణమా?

కారణంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కడుపు నిండడం కూడా కష్టంగా మారిన కొందరు కూలీలు దిక్కుతోచని స్థితిలో దారుణాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కన్నతండ్రే కూతురు గొంతుకోసి హతమార్చిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పుల్కల్ మండలం గొంగలూరు తండాకు చెందిన రమావత్ జీవన్‌కి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

ఏమైందో ఏమో తెలియదు నిద్రిస్తున్న కూతురు అవంతిక(4)ని తండ్రి జీవన్ దారుణంగా హత్య చేశాడు. కిరాతకంగా ఆమె గొంతుకోసి చంపేశాడు. కన్నకూతురిని అత్యంత అమానుషంగా అంతం చేశాడు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెందిన జీవన్ ఈ దారుణానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కావడంతో పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించడంతో దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here