కారుతో యువకుడిని ఢీకొట్టి.. పైకి లేవడంతో మళ్లీ తొక్కించి.. ప్రకాశం జిల్లాలో దారుణం

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. పాతకక్షల నేపథ్యంలో యువకుడిని కారుతో ఢీకొట్టి అమానుషంగా చంపేశారు. కారు గుద్ది వెళ్లిపోయిన అనంతరం యువకుడు పైకి లేవడంతో మళ్లీ వెనక్కి వచ్చి కారుతో తొక్కించి కిరాతకంగా హత్య చేశారు. ఇద్దరూ దాయాది కుటుంబాలకు చెందిన అన్నదమ్ములే కావడం గమనార్హం. యువకుడు చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన జెట్టి కరుణాకర్‌కి పోరుమామిళ్లపల్లి గ్రామానికి చెందిన జెట్టి కాశీవిశ్వేశ్వరరావు దాయాదులు. లాక్‌డౌన్ కారణంగా ఇద్దరూ విజయవాడ నుంచి స్వగ్రామాలకు వచ్చారు. అమ్మాయి విషయమై ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. కరుణాకర్ మేనకోడలిని కాశీవిశ్వేశ్వరరావు వేధింపులకు గురిచేస్తుండడంతో పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Also Read:

ఈ విషయమై గతంలో పోలీస్ స్టేషన్‌లో కాశీవిశ్వేశ్వరావుపై కేసులు కూడా నమోదయ్యాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం షాపులు తెరుచుకోవడంతో కాశీ తన స్నేహితులతో కలసి మద్యం తాగుతున్నాడు. ఆ సమయంలో కరుణాకర్ ఫోన్ చేసి మందలించడంతో కాశీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇద్దరూ ఫోన్‌లో తీవ్రంగా దూషించుకుని చంపేస్తానంటూ పరస్పరం బెదిరింపులకు దిగారు. అనంతరం కాశీ కంభం వైపు బైక్‌పై వెళ్లాడని తెలుసుకున్న కరుణాకర్ కాపుకాశాడు.

Read Also:

కందులాపురం వద్ద వేగంగా వస్తున్న కాశీ బైక్‌ని కారుతో ఢీకొట్టాడు. బైక్‌ పైనుంచి కిందపడిపోయిన కాశీ మెల్లగా పైకి లేచి పక్కకు వెళ్తుండగా కరుణాకర్ కారుని వెనక్కి తిప్పి మరోసారి కాశీని ఢీకొట్టి తొక్కించేశాడు. దీంతో కాశీ అక్కడికక్కడే మరణించాడు. ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న అనంతరం కరుణాకర్ కారుతో సహా నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here