కామంతో కళ్లుమూసుకుపోయి నర్సులపై నీచం.. నడిరోడ్డుపై దారుణం

కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గులు నీచానికి పాల్పడ్డారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విధులు నిర్వర్తిస్తున్న నర్సులపై అత్యాచార యత్నం చేశారు. తమ సహోద్యోగిని కోసం ఆస్పత్రికి వెళ్తున్న నర్సులను నడిరోడ్డుపై అడ్డగించి రేప్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ దారుణ ఘటన అస్సాంలోని జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని బిశ్వనాధ్ చారియాలి పట్టణంలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు నర్సులు తమ సహోద్యోగిని కోసం ఆస్పత్రికి బయల్దేరారు. తమ కోసం ఎదురుచూస్తున్న స్నేహితురాలిని తీసుకొచ్చేందుకు ఆస్పత్రికి వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు వారిని అడ్డగించారు. పెట్రోల్ బంకు సమీపంలో వారిని అటకాయించి అసభ్యంగా ప్రవర్తించారు.

Also Read:

రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఇద్దరు నర్సులపై అత్యాచార యత్నం చేశారు. ఊహించని ఘటనతో భయపడిపోయిన నర్సులు ఎలాగో వారి బారి నుంచి తప్పించుకుని ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి సిబ్బందికి విషయం తెలియజేయడంతో వారు దుండగులను వెంబడించారు. ఒక నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here