కాపురాల్లో చిచ్చుపెట్టిన ఆ సంబంధం.. వికారాబాద్ జంట ఆత్మహత్యల కేసులో షాకింగ్ నిజాలు

జిల్లా అడవిలో జంట ఆత్మహత్యల కేసులో షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి. వివాహేతర సంబంధమే ఆత్మహత్యలకు దారితీసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లికి చెందిన జనగాం మహేందర్(38), ఇందోల్‌కి చెందిన శివనీల(36) అడవిలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సుమారు నెలరోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడంతో అప్పటికే వారి మృతదేహాలు కుళ్లిపోయి అస్థిపంజరాలు మాత్రమే చెట్టుకు వేలాడుతున్నాయి.

కోట్‌పల్లికి చెందిన మహేందర్ భార్యతో కలసి ధారూర్‌లో నివాసం ఉంటూ మేస్త్రీగా పని చేస్తున్నాడు. సమీపంలోని ఇందోల్‌కి చెందిన కూలీ శివనీలతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇళ్లలో తెలియకుండా ఇద్దరూ కొద్దికాలం ఆ సంబంధం కొనసాగించారు. అయితే భర్త వివాహేతర సంబంధం గురించి మహేందర్ భార్యకి తెలియడంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.

Also Read:

తన భార్య వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకుందన్న విషయం శివనీల భర్తకి కూడా తెలిసిపోవడంతో కాపురంలో కలహాలు రేగాయి. ఈ క్రమంలో ఆమె ధారూర్‌లోని ప్రియుడు మహేందర్ ఇంటికి వచ్చింది. అనంతరం వారిద్దరూ కలసి ఎక్కడికో వెళ్లిపోయారు. ఇద్దరూ పారిపోయారని భావించి ఇరుకుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇద్దరి సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టడంతో అనంతగిరి అటవీ ప్రాంతంలో చూపినట్లు తెలుస్తోంది. అయితే వారి సెల్‌ఫోన్లు స్విచాఫ్ కావడంతో వారి ఆచూకీ కనిపెట్టడం కష్టమైంది. జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పశువుల కాపరులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను మహేందర్, శివనీలగా గుర్తించారు.

Read Also:

అప్పటికే సుమారు నెలరోజులు గడచిపోవడంతో మృతదేహాలు కుళ్లిపోయి అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి. దీంతో మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యలకు దారితీసింది. ఇద్దరి కాపురాల్లో చిచ్చు రాజేయడంతో అవమాన భారంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here