కానిస్టేబుల్ వేలు కొరికేసి బీభత్సం.. విజయవాడలో దారుణం

లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు సహకరించాల్సిందిపోయి కొందరు వారిపైనే ఎదురుదాడులకు దిగుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించారని అడ్డుకున్నందుకు పంజాబ్‌లో ఏఎస్సై హర్జీత్ సింగ్ చేయి నరికేసిన ఘటన దేశాన్ని షాక్‌కి గురిచేసింది. ఇంచుమించు అలాంటి ఘటనే విజయవాడలో జరిగింది. ఆయుధాలు లేకపోయినా పళ్లతోనే పోలీస్‌పై దాడి చేశాడో యువకుడు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌‌ని తీవ్రంగా గాయపరచిన దారుణ ఘటన విజయవాడలో వెలుగుచూసింది.

నగరంలోని రాణిగారితోట పరిధిలోని అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళ ఇంటి పనులు చేస్తుంటుంది. ఆమె రెడ్‌జోన్ పరిధిలోని ఏరియా నుంచి వస్తోందని కంట్రోల్ రూమ్‌కి సమాచారం రావడంతో రెడ్‌జోన్‌లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆంజనేయులుని అప్రమత్తం చేశారు. ఆ మహిళ వివరాలు సేకరించాల్సిందిగా కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు రావడంతో ఆయన అపార్ట్‌మెంట్‌కి వెళ్లారు. పనిమనిషి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

Also Read:

అక్కడి వారిని ఆరా తీస్తుండగా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సయ్యద్ సైదా అలీమ్ అనుచితంగా ప్రవర్తించాడు. అసలు అపార్ట్‌మెంట్‌కి ఎందుకొచ్చావంటూ గొడవకు దిగి కానిస్టేబుల్ వేలు కొరికేశాడు. దీంతో కానిస్టేబుల్ చేతివేలికి గాయమైంది. ఈ ఘటనపై కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అలీమ్‌ని అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here