కానిస్టేబుల్‌పై కూరగాయల వ్యాపారి దాడి.. బోరబండలో దారుణం

లాక్‌డౌన్ కారణంగా ప్రజలు బయటకు రావొద్దని, ఇళ్లల్లోనే ఉండాలని పోలీసులు, అధికారుల ఎంత చెప్పినా కొంతమంది ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇష్టారీతిగా తిరుగుతూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇక కూరగాయల మార్కెట్లో అయితే చాలామంది భౌతిక దూరం పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే మంచి మాటలు చెప్పిన పోలీసులపైనే దాడికి యత్నిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బోరబండలో ఓ కూరగాయల వ్యాపారి పోలీస్ కానిస్టేబుల్‌పైనే దాడికి యత్నించాడు.

Also Read:

బోరబండలోని బస్తీ మార్కెట్‌లో మంగళవారం ఉదయం కూరగాయలు కొనేందుకు ప్రజలు భారీగా వచ్చారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా తిరుగుతుండటంతో కానిస్టేబుల్ శంకర్‌పై అక్కడికి చేరుకుని ప్రజలను హెచ్చరించాడు. ఓ కూరగాయల వ్యాపారి వద్ద జనం ఎక్కువగా ఉండటంతో దూరం పాటించాలని సూచించాడు. దీంతో తన వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాడన్న కోపంతో ఆ వ్యాపారి కానిస్టేబుల్‌పై రాళ్లతో దాడి చేశాడు. దీంతో అతడు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మార్కెట్‌కు వచ్చేసరికే వ్యాపారి పరారయ్యాడు. పోలీసులు కానిస్టేబుల్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here