కరోనా వ్యాక్సిన్ ఎప్పటికీ అందుబాటులో రాకపోవచ్చు: డబ్ల్యూహెచ్‌వో నిపుణుడు

వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలు తలమునకలై ఉన్నాయి. 100కుపైగా వ్యాక్సిన్లు ప్రి-క్లినికల్ ట్రయల్స్‌లో ఉండగా… కొన్ని వ్యాక్సిన్లను మనుషులపైనా ప్రయోగిస్తున్నారు. కాగా కొందరు ఆరోగ్య నిపుణులు మాత్రం.. కోవిడ్-19కు అసలు వ్యాక్సిన్ లభ్యం కాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి పరిశోధనలు చేసినా హెచ్ఐవీ, డెంగ్యూకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాని విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కొన్ని వైరస్‌లకు ఇప్పటి వరకూ వ్యాక్సిన్లు తయారు చేయలేదని.. కరోనాకు కూడా ఎప్పటికీ వ్యాక్సిన్ తయారు చేయలేకపోయే పరిస్థితి కూడా ఉండొచ్చని.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కోవిడ్-19 ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నబర్రో తెలిపారు.

దాదాపు 40 ఏళ్ల తర్వాత, 3.2 కోట్ల మంది చనిపోయాక కూడా ప్రపంచం హెచ్ఐవీ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. డెంగ్యూ జ్వరానికి కూడా ఇప్పటి వరకూ వ్యాక్సిన్ లేదు. డబ్ల్యూహెచ్‌వో వివరాల ప్రకారం ఏటా లక్షల మంది దీని బారిన పడుతున్నారు. కొన్ని దేశాల్లో డెంగ్యూ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. గతంలో డెంగ్యూ బారిన పడిన వారు మాత్రమే దాన్ని వేయించుకోవాలి.

ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చేపట్టిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాలు ఆశాజనకంగా ఉన్న సంగత తెలిసిందే. 102 వ్యాక్సిన్ ప్రయోగాలు వివిధ దశల్లో ఉండగా.. 8 మాత్రం మనుషులపై ప్రయోగ దశలో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here