కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: మే 18కి దేశంలో 40వేల యాక్టివ్ కేసులు.. టైమ్స్ ఫ్యాక్ట్ రిపోర్ట్

⍟ ప్రపంచం మొత్తం కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. మహమ్మారి దెబ్బకు అన్ని దేశాలూ చిగురుటాకులా వణుకుతున్నాయి. ఐరోపా, అమెరికాలో నిన్న మొన్నటి వరకూ స్వైరవిహారం చేసిన మహమ్మారి అక్కడ పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాకపోయినా.. గత వారంతో పోలిస్తే కొత్త కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లో మరణాలు తగ్గుముఖం పట్టాయి. పూర్తి కథనం..

⍟ కరోనా వైరస్ బాధితులకు చికిత్స సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. కరోనా వైరస్‌ స్వల్ప లక్షణాలున్న వారు, వ్యాధి సోకినా ఆ లక్షణాలు లేనివారు ఇక నుంచి ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చు. స్వీయ నిర్బంధలో ఉండి, ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఎప్పటికప్పుడు సహకరించడానికి అంగీకరించే బాధితులకు ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు స్పష్టం చేసింది. పూర్తి కథనం..

⍟ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గతేడాది నవంబరు 27 బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. చట్టసభలో ఉద్ధవ్ ప్రతినిధి కాకపోయినా కూటమి తరఫున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 నిబంధనల ప్రకారం.. చట్టసభలో ప్రతినిధికాని వ్యక్తులు సీఎం లేదా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకు ఎన్నికావాల్సి ఉంటుంది. పూర్తి కథనం..

⍟ దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పట్టినా.. పాజిటివ్ కేసులు మాత్రం రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,890 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా. మరో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,411కి చేరుకోగా.. మరణాలు 1,000 దాటాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 9,289 మందికి వైరస్ సోకింది.

⍟ ఏప్రిల్ 28 నాటికి దేశంలో సుమారు 30 వేల కరోనా కేసులు నమోదు కాగా.. మే 18 నాటికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 40 వేలకు చేరే అవకాశం ఉందని టైమ్స్ నౌ ఇండియా ఔట్‌బ్రేక్ రిపోర్ట్ అంచనా వేసింది.

⍟ మే 3న దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్ ముగిసే నాటికి దేశంలో గరిష్టంగా 28,149 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉండే అవకాశం ఉందని టైమ్స్ ఫ్యాక్ట్ – ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్ట్ అంచనా వేసింది. లాక్‌డౌన్ చివరి నాటికి దేశంలో యాక్టివ్ కేసుల 26,901 నుంచి 28,149 వరకు ఉండొచ్చని తెలిపింది.

ప్ర పంచ దేశాల్లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుండగా పరీక్షలకు డిమాండ్ పెరిగింది. జంతువులకూ పరీక్షలు తప్పడం లేదు. కుక్కలకు కరోనా వైరస్‌ సోకిందని గ్రామస్థుల ఫిర్యాదు చేయడంతో అధికారులు అందుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. జోగుళాంబ

జిల్లా మనోపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలో మంగళవారం (ఏప్రిల్ 29) ఈ ఘటన చోటు చేసుకుంది.

⍟ ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా కరోనా నయం అవుతుందడానికి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉందని తెలిపింది. ప్లాస్మీ థెరపీ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా అధ్యయనం ప్రారంభించిందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

⍟ మే 3 తర్వాత దేశవ్యాప్తంగా

ముగుస్తోన్న నేపథ్యంలో.. గ్రీన్ జోన్లలో కార్యకలాపాలు సాగించేలా

ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ టీఎం విజయ్ భాస్కర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలో 30 జిల్లాలు ఉండగా.. వాటిని నాలుగు జోన్లుగా విభజించారు.

⍟ కరోనా వైరస్‌ (కోవిడ్ 19) వ్యాప్తితో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్

మంగళవారం సాయంత్రం సొంత రాష్ట్రానికి బయల్దేరారు. 36 బస్సుల్లో మత్స్యకారులు ఏపీకి పయనమయ్యారు.

⍟ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధికార యంత్రాంగానికి చెందిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఏపీ రాజ్‌భవన్ ఉద్యోగులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ సెక్రటేరియట్ అటెండర్‌కు కరోనా వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here