కరోనా యోధులకు త్రివిధ దళాల జేజేలు.. మే 3న కనువిందు

క రోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధులకు ఘనంగా కృత‌జ్ఞతలు తెలపడానికి భారత త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. ఈ ఆదివారం (మే 3) దేశ ప్రజలు మధుర అనుభూతులు సొంత చేసుకున్నారు. కరోనా వారియర్స్‌కు ఘనంగా జేజేలు పలుకుతూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) శుక్రవారం వెల్లడించారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు పూలవర్షం కురిపిస్తాయని ఆయన తెలిపారు. అదే రోజు సాయంత్రం భాతర తీర ప్రాంతాల్లో ఇండియన్ నేవీ తమ యుద్ధ నౌకలపై ప్రత్యేక దీపాలు వెలిగించనున్నాయని వెల్లడించారు.

నేవీకి చెందిన ముఖ్యమైన నౌకలన్నింటినీ ఆదివారం తీర ప్రాంతాల్లో మొహరించనున్నట్లు బిపిన్ రావత్ వెల్లడించారు. కోవిడ్-19 ఆస్పత్రులపై పూలవర్షం కురిపించే కార్యక్రమంలో ఇండియన్ నేవీ యుద్ధ విమానాలు కూడా పాల్పంచుకుంటాయని ఆయన తెలిపారు. శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు ఓ బృందం, దిబ్రూగడ్ నుంచి కచ్ (గుజరాత్) వరకు మరో బృందం ఎంపిక చేసిన ఆస్పత్రులపై పుష్పాలు కురిపిస్తూ ముందుకు సాగుతాయని ఆయన తెలిపారు. ఒక్కో బృందంలో 6 ఫైటర్ జెట్ ఎయిర్ క్రాప్ట్‌లు ఉంటాయని చెప్పారు.

Also Read:

ఆదివారం ఉదయం వార్ మెమోరియల్, పోలీస్ మెమోరియళ్ల వద్ద నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుందని బిపిన్ రావత్ తెలిపారు. కరోనాపై పోరాటం సాగిస్తున్న డాక్టర్లు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసు సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్న దేశ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం భారత త్రివిధ దళాలను ఏకతాటిపైకి తీసుకొస్తూ చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి మొట్టమొదటి అధిపతిగా మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్‌ను నియమించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం త్రివిధ దళపతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి కావడం విశేషం.

Must Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here