కరోనా మృతురాలి ముక్కుపుడక మాయం.. ఒంటిపై బంగారం ఒలిచేసిన కిలాడీలు

కరోనా కష్టకాలంలోనూ దొంగలు రెచ్చిపోతున్నారు. ఏకంగా కరోనాతో చనిపోయిన మహిళ ముక్కుపుడకను మాయం చేసేశారు. కంటికి కనిపించని వైరస్ ఎక్కడ సోకుతుందోనని జనం బెంబేలెత్తిపోతుంటే.. కరోనాతో చనిపోయిందని తెలిసి కూడా ఆమె ముక్కుపుడక, చెవిదిద్దులు మాయం చేయడం విస్మయానికి గురిచేసింది. మృతురాలి ఒంటిపై ఉండాల్సిన బంగారం కనిపించకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన రాజధాని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.

నగరంలోని అమ్రాయ్‌వాడి ప్రాంతానికి చెందిన బిందు రాజ్‌పుత్(50)కి కరోనా సోకడంతో కోవిడ్ 19 ప్రత్యేక ఆస్పత్రిగా మార్పు చేసిన సివిల్ ఆస్పత్రిలో చేరింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు విడిచింది. అయితే ఆమె మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులకు షాకింగ్ విషయం కంటపడింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఆమె సెల్‌ఫోన్ ఆస్పత్రిలో చోరీకి గురైన విషయాన్ని గుర్తించారు. మృతురాలి భర్త శివ్‌పుజన్ రాజ్‌పుత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read:

ఇదే విషయమై అమ్రాయ్‌వాడి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ జగదీష్ రాథోడ్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌కి లేఖ రాశారు. కరోనాతో చనిపోయిన మహిళ బంగారం కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అదే విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, నగర పోలీస్ కమిషనర్‌కి కూడా లేఖలు రాశారు. కరోనా మృతుల ఒంటిపై బంగారం, విలువైన వస్తువులు చోరీ చేయడం క్షమించరాని నేరమని.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మృతురాలి ఒంటిపై ఒక జత చెవిదిద్దులు.. ముక్కుపుడక చోరీకి గురైనట్లు చెప్పారు. అలాగే ఆమె సెల్‌ఫోన్ కూడా కనిపించలేదని.. చార్జర్‌తో సహా దొంగిలించినట్లు పేర్కొన్నారు. కరోనా మృతుల ఒంటిపై బంగారం.. వారి విలువైన వస్తువులు ఆస్పత్రిలో చోరీకి గురికావడం ఇదే తొలిసారి కాదని.. గతంలోనూ ఒక మహిళ ఒంటిపై ఉన్నబంగారం చోరీ చేశారన్నారు. అయితే భార్య మరణంతో షాక్‌ తిన్న ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here