కరోనా డ్రగ్.. తొలి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్ ఫ‌లితం వ‌చ్చేసింది

క‌రోనా వైర‌స్ మందుకు సంబంధించి తొలి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్ ఫెయిలైంది. గిలీడ్ సైన్సైస్ అనే సంస్థ యాంటివైర‌ల్ రెమ్‌డెసివిర్ డ్రగ్‌ను అభివృద్ధి చేసి తాజాగా ప‌రీక్షించింది. చైనాలో ప‌రీక్షించిన క్లినిక‌ల్ ట్ర‌య‌ల్‌లో రోగుల ఆరోగ్యం ఏమాత్రం మెరుగుప‌డ‌లేద‌ని తెలుస్తోంది. ఈ మందు‌ను ఇప్ప‌టికే 237 మందికి ఇవ్వాల‌ని భావించారు. అందులో 158 మందికి ఇచ్చారు. అయితే వ్యాక్సిన్ ఇచ్చిన కొంద‌రిలో సైడ్ ఎఫెక్ట్ కూడా వ‌చ్చాయిని స‌మాచారం.

Must Read:

మ‌రోవైపు గిలీడ్ సంస్థ డ్రగ్ ఫెయిల‌వ‌డంతో ట్రేడింగ్‌లో ఆ సంస్థ షేర్లు ఆరు శాతం న‌ష్ట‌పోయింది. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌‌కు సంబంధించి యూకేలో ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. ఇప్ప‌టికే మాన‌వుల‌పై ప్ర‌యోగాలు ప్రారంభిస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ విజ‌య‌వంత‌మ‌య్యే అవ‌కాశాలు 80 శాత‌మున్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

Must Read:

ప్ర‌ముఖ ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ఈ వైర‌స్ వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ వ్యాప్తి యూకేలో అత్య‌ధికంగా ఉంది. ఇప్ప‌టికే ల‌క్షా 37వేల‌మంది క‌రోనా పాజిటివ్‌గా తేలారు. అలాగే 18,700మందికిపైగా మృత్యువాత ప‌డ్డారు. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ ప్రాజెక్టుకు యూకే ప్ర‌భుత్వం 20 మిలియ‌న్ పౌండ్లు నిధులను కేటాయించింది. హానిక‌రం కాని చింపాంజి వైర‌స్ నుంచి ఈ వ్యాక్సిన్ రూపొందించిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here