కరోనా కష్టకాలంలో అవసరమైన వారికి భారత్ అండగా ఉంది.. ప్రధాని మోదీ

బుద్ధుని బోధనలు, ప్రవచనాలతో భారత సంస్కృతి పరిపుష్టమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా గౌతమ బుద్ధుని బోధనలను ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో బుద్ధ పూర్ణిమను దేశవ్యాప్తంగా వర్చ్యువల్‌గా జరుపుకొంటున్నారు. సందర్భంగా కరోనా యోధుల గౌరవార్థం కేంద్ర సాంస్కృతిక శాఖ, ఇంటర్నేషనల్‌ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్‌ (ఐబీసీ)లు సంయుక్తంగా ఓ వర్చ్యువల్‌ సమావేశాన్ని నిర్వహించారు. లుంబిని ఉద్యానవనం (నేపాల్‌), మహాబోధి ఆలయం (బుద్ధగయ) లతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక బౌద్ధసంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… ‘ప్రపంచంలోని అన్ని విషయాల కంటే బుద్ధి ప్రధానమైందని బుద్ధుడు ప్రవచించారు. ఆయన దమ్మ బోధనల ప్రకారం, ప్రపంచంలోని అన్ని ధోరణులకు బుద్ధి మార్గదర్శకత్వం వహిస్తుంది. మనం బౌద్ధికంగా కలసి ఉంటే… భౌతికంగా ఒకరికొకరు అందుబాటులో లేకపోయిన లోటు తెలియదు. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు అనుకూలంగా లేకున్నా, మీ మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉంది. భౌతికంగా కలవలేకపోయినా, సాంకేతికత ద్వారా మీ అందరితో మాట్లాడే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది.’ అని తెలిపారు. ఉమ్మడి ప్రయత్నాల ద్వారా మానవత్వాన్ని వెలికితీసి ఈ క్లిష్ట పరిస్థితిని ఎదిరిద్దామని ప్రధాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

నుంచి ప్రతి పౌరుడి ప్రాణాలను కాపాడటమే తమ ముందున్న లక్ష్యమని మోదీ పునరుద్ఘాటించారు. మహమ్మారి వ్యాప్తిని ప్రపంచం కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటోందని అన్నారు. కష్టకాలంలో బలంగా, నిస్వార్థంగా దేశం నిలబడిందని వ్యాఖ్యానించారు. విపత్కర పరిస్థితుల్లోనూ అవసరమైన వారికి సహాయం అందజేసి, ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచామన్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు సహాయం కోసం భారతదేశం వైపు చూశాయని, మనం కూడా వారిని ఆదుకున్నామని తెలిపారు.

మానవులు నిరంతరం క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి కృషి చేయాలని బుద్ధుని బోధనలు చెబుతాయని, ఈ మహమ్మారి సమయంలో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. విజయం లక్ష్యాలు, ప్రమాణాలు కాలంతో పాటు మారుతాయి, కానీ మన చేయాల్సిన పనిని గుర్తుంచుకోవాలని, మానవాళి పట్ల కరుణ, నిస్వార్ధంతో సేవ చేయాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here