కరోనాకు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్.. కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ మహిళ

కరోనా వైరస్‌కు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ బృందంలో భారతీయ మహిళా శాస్త్రవేత్త కూడా ఉన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారు. కోల్‌కతాకు చెందిన (34) ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో వ్యాక్సిన్ తయారీ విభాగంలోని క్వాలిటీ ఎష్యూరెన్స్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతవారం ఈ వ్యాక్సిన్‌ను మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. సెప్టెంబరు లేదా అక్టోబరులో ఇది మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.

కోల్‌కతాలోని గోఖలే మెమోరియల్ గర్ల్స్ స్కూల్‌లో ప్రాథమిక విద్య, హెరిటేజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ (బయోటెక్నాలజీ) పూర్తిచేశారు. అనంతరం 2009లో బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్సిటీలో ఎంఎస్సీ (బయోసైన్సెస్) కోర్సును అభ్యసించారు. తర్వాత ప్రపంచ ప్రముఖ ఫార్మాల్లో పనిచేసి, ఆక్స్‌ఫర్స్ యూనివర్సిటీ క్లినికల్ బయో-మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో క్వాలిటీ ఎష్యూరెన్స్ మేనేజర్‌గా చేరారు. వ్యాక్సిన్ తయారీ నాణ్యత ప్రమాణాలు, విధానాలను దత్తా పర్యవేక్షిస్తున్నారు.

వ్యాక్సిన్ తయారీకి సంబంధించి పేపర్ వర్క్ పరిశీలన పూర్తిచేసిన తర్వాత, క్వాలిటీ కంట్రోల్ విభాగం దీనిని ధ్రువీకరిస్తారు.. ప్రస్తుతం వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్‌కు వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉందని దత్తా వ్యాఖ్యానించారు. ఇదో గొప్ప అనుభవమని, గత నెల ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నామని, కానీ తక్షణమే దానిని నుంచి బయటపడ్డామని అన్నారు.

చంద్రా దత్తా టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఫోన్‌లో మాట్లాడుతూ.. క్లినికల్ ట్రయల్స్‌కు ముందే పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌లో సామూహిక తయారీని ప్రారంభించాలని భావించామని, కాబట్టి క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయిన వెంటనే మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందన్నారు. ‘వ్యాక్సిన్ అభివృద్ధికి సాధారణంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది.. తాము దీన్ని కొన్ని నెలల్లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకు తాము సుమారు 600 టీకాలు తయారు చేశాం. వీటిని 1,000కి పెంచాలని భావిస్తున్నాం.. అలాగే బ్రిటన్‌లో మరిన్ని ఉత్పాదక సదుపాయాలను పరిశీలిస్తున్నారు.. ఇది ఇంకా ఖరారు కాలేదు’ అని ఆమె అన్నారు.

వచ్చే నెలలో మరో 800 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగానికి ఆక్స్‌ఫర్డ్ బృందం సమాయత్తమవుతుంది.. ఇది విజయవంతమైతే కెన్యాలో పరీక్షలకు అనుమతి కోసం ఆ ప్రభుత్వాన్ని సంప్రదిస్తారని అన్నారు. బ్రిటీష్ ఆవిష్కరణ అయినందున దీనిపై పేటెంట్ దానికే ఉంటుందని అనుకుంటున్నాను. వీలైనంత ఎక్కువ సంఖ్యలో తయారు చేసి ప్రపంచానికి అందజేయాల్సి ఉంటుంని ఆమె దత్తా వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here