కరెంట్‌ షాక్‌తో వృద్ధ దంపతుల మృతి.. నిజామాబాద్‌‌లో విషాదం

కరెంట్ షాక్ భార్యభర్తల ప్రాణాలను బలిగొన్న హృదయ విదారక సంఘటన తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం మిట్టాపల్లిలో చోటుచేసుకొంది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం బొప్పాస్‌పల్లికి చెందిన దారావత్‌ శంకర్‌ (61), మారోనిబాయి (55) దంపతులు కొంతకాలంగా మిట్టాపల్లిలోని మామిడితోటలో పనిచేస్తున్నారు. కోడలు, ఆమె ఇద్దరు పిల్లలు, కూతురు రుక్మిణిబాయి, ఆమె ముగ్గురు కూతుళ్లతో కలసి తోటలోని రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. శంకర్‌ మంగళవారం ఉదయం తోటకు వేసిన ఫెన్సింగ్‌ సమీపంలో స్నానానికి వెళ్లారు. పక్క పొలంలోని టేపు చుట్టని ఓ బోరు మోటారు తీగ కంచెకు తగిలి విద్యుత్తు సరఫరా అవుతోంది.

Also Read:

ఈ విషయాన్ని గమనించని శంకర్‌ స్నానం చేస్తున్న సమయంలో కంచెపై చేయి వేశాడు. దీంతో కరెంట్ షాక్‌ కొట్టి మృతి చెందాడు. భర్త కేకలు విని పరుగు పరుగుల అక్కడికి చేరుకున్న మారోనిబాయి (55) అతడి చేతిని పట్టుకుని లాగేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులను కాపాడబోయిన రుక్మిణిబాయి స్వల్పగాయాలకు గురై ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. రుక్మిణిబాయి ఫిర్యాదు మేరకు పక్క పొలం యజమాని ఎర్రోల్ల పెద్ద గంగాధర్‌గౌడ్‌పై కేసు నమోదు చేసినట్ల్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పెద్దల మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here