కరాచీ బేకరీలో రూ.10లక్షల చోరీ.. హైదరాబాద్‌లో కలకలం

నగరంలో భారీ చోరీ జరిగింది. ఎంజే మార్కెట్ సమీపంలోని కరాచీ బేకరీలో దొంగలు ఏకంగా రూ.10లక్షల నగదు దోచుకుని పరారయ్యారు. పోలీస్ చెక్‌పోస్ట్ సమీపంలోనే ఈ ఘటన జరగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.

Search Results

Web results మొజంజాహీ మార్కెట్ చౌరస్తాలోని ఓ భవనంలో చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా పోలీసుల ఆంక్షలకు అనుగుణంగా అప్పుడప్పుడూ మాత్రమే ఈ బేకరీని తెరుస్తున్నారు.

Also Read:

అయితే బుధవారం ఉదయం బేకరీని తెరిచిన యజమానులు లాకర్‌ పగులగొట్టి ఉండటం చూసి షాకయ్యారు. అందులో ఉండాల్సిన రూ.10లక్షల నగదు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్ సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. భవనం మధ్యనున్న చిన్న సందు నుంచి దొంగలు లోనికి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీని వెనుకే పోలీస్ చెక్‌పోస్టు ఉన్నప్పటికీ దొంగలు ఇంత ధైర్యంగా ఎలా వచ్చారన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యజమానులు ఏకంగా రూ.10లక్షల నగదు బేకరీలో ఎందుకు ఉంచారన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here