కనురెప్ప మూశాడు.. కనుమరుగైపోయాడు.. ప్రకాశంలో విషాదం

ఎలాగైనా సొంతూరు వెళ్లాలని భావించి బైక్‌పై బయల్దేరిన భవన నిర్మాణ కార్మికుడిని నిద్రరూపంలో ముంచుకొచ్చిన మృత్యువు మింగేసింది. అర్ధరాత్రి ప్రయాణంతో అలసిపోయి బైక్ నడుపుతూనే నిద్రలోకి జారుకోవడంతో అదుపుతప్పి డివైఢర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

మండలం విక్కిరాలపాడుకి చెందిన మరమాల మాలకొండయ్య, ఉన్నం మాల్యాద్రి ఉపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఇటీవల ప్రభుత్వం కొద్దిగా సడలింపులు ఇవ్వడంతో ఎలాగైనా సొంతూరు వెళ్లాలని అర్ధరాత్రి బైక్‌పై బయల్దేరారు. ఏపీ సరిహద్దు దాటి జిల్లాలోకి ప్రవేశించారు. మరికొద్ది గంటల్లో ఇంటికి చేరతామనుకునేలోగా మృత్యువు ముంచుకొచ్చింది.

Also Read:

జిల్లాలోని మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు సమీపంలోకి రాగానే బైక్ ప్రమాదానికి గురైంది. బండి నడుపుతున్న మాలకొండయ్య నిద్రమత్తులోకి జారుకోవడంతో బైక్ అదుపుతప్పి డివైఢర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై తీవ్ర రక్తస్రావంతో మాలకొండయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనుక కూర్చున్న మాల్యాద్రి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here