ఒకే ఇంట్లో భార్య, ప్రియురాలు.. చివరికేమైందంటే..!

భార్య ఇంట్లో ఉండగానే ప్రియురాలిని ఇంటికి తెచ్చాడు భర్త. ఒకే ఇంట్లో ఇద్దరితో కాపురం చేయడం మొదలుపెట్టాడు. కొద్దిరోజులు ముగ్గరూ కలసి ఒకే ఇంట్లో ఉన్నారు. సడెన్‌గా ప్రియురాలి కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను తీసుకెళ్లిపోయారు. కొద్దిరోజులకే భార్య బావిలో శవమై తేలింది. ఆ రోజు నుంచే భర్త కనిపించకుండా పోయాడు. భార్యను భర్తే దారుణంగా చంపేసి పరారైనట్లు గుర్తించారు పోలీసులు. ఈ దారుణ ఘటన లుధియానాలో వెలుగుచూసింది.

జార్ఖండ్‌కి చెందిన మహమ్మద్ రివాని, షకీలా బీబీ దంపతులు. బతుకుదెరువు కోసం పంజాబ్‌కి వలసవచ్చి ప్రాంతంలోని అలంగిర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. షకీలాకి రివానితో రెండో వివాహం. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రివాని ఆమెను ఏకంగా ఇంటికి తీసుకొచ్చాడు. భార్య, ప్రియురాలిని ఒకే ఇంట్లో పెట్టాడు. ఆమె కూడా కొద్ది రోజులు వారితోనే కలసి ఉంది.

Also Read:

విషయం తెలుసుకున్న ప్రియురాలి కుటుంబ సభ్యులు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి భార్యాభర్తల నడుమ వివాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆగ్రహం చెందిన రివాని భార్య షకీలాని చంపేసి సమీపంలోని ధంధారన్ గ్రామంలోని బావిలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మూడు రోజుల అనంతరం మహిళ శవం బావిలో పైకి తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు.

Read Also:

మృతురాలిని షకీలా బీబీగా గుర్తించారు. ఆమె భర్త రివాని జార్ఖండ్ పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. అయితే భార్యని చంపేసి బావిలో పడేసినట్లు తెలుస్తోంది. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో గొంతుపిసికి చంపిన ఆనవాళ్లు లేవు. విషమిచ్చి చంపేసి బావిలో పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉందని.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here