ఏడేళ్ల బాలికపై పక్కింటి యువకుడి అత్యాచారం.. తూ.గో. జిల్లాలో దారుణం

జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఏడేళ్ల బాలికపై ఓ యువకుడు(23) అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు మూడు రోజుల కిందట సీతానగరంలోని ఈ గ్రామంలో ఉండే తన పెద్దమ్మ ఇంటికి వచ్చాడు. వారి ఇంటి పక్కనే ఓ కుటుంబం నివసిస్తోంది. వారికి ఏడేళ్ల కుమార్తె ఉంది.

Also Read:

ఆ బాలికపై కన్నేసిన యువకుడు తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లోకి దూరి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కోరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు పీఎస్ ఎదుట కాసేపు ఆందోళన చేపట్టారు. కోరుకొండ డీఎస్పీ పీఎస్‌ఎన్‌ రావు, సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు గ్రామానికి చేరి వివరాలు సేకరించారు. యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, బాలికను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం స్పెషల్ టీమ్‌ను పంపించినట్లు ఎస్సై ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here