ఎస్ఐనే బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు… కర్నూలు జిల్లాలో కలకలం

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ అనూహ్యంగా ఓ ఎస్ఐ సైబర్ నేరస్థుల వలలో చిక్కుకున్నారు. జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం… గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ డ్రైవర్‌, గోనెగండ్లకు చెందిన మల్లయ్య(45) ఏప్రిల్‌ 19న ఆకస్మికంగా మృతిచెందాడు. అదే నెల 29న సైబర్‌ నేరస్థుడు గోనెగండ్ల ఎస్సైకి ఫోన్‌ చేసి.. తాను ఇంటెలిజెన్స్‌ డీఎస్పీనంటూ పరిచయం చేసుకున్నాడు.

Also Read:

ఆయన చెప్పినదంతాఎస్సై నమ్మి మల్లయ్య కుటుంబ సభ్యులను పిలిపించి ఫోన్‌లో మాట్లాడించారు. మల్లయ్యకు కరోనా బీమా కింద రూ.7.60 లక్షలు వస్తాయని, అందుకు జీఎస్‌టీ కింద రూ.36 వేలు చెల్లించాలని చెప్పాడు. తర్వాత ఎస్ఐ లాక్‌డౌన్‌ విధుల్లో నిమగ్నం కావడంతో బాధితులు తమతో మాట్లాడిన వ్యక్తి(సైబర్‌ నేరగాడు)కి నేరుగా ఫోన్‌ చేశారు. అతడు చెప్పినట్లుగా రూ.18 వేల చొప్పున రెండుసార్లు ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. తర్వాత అవతలి వ్యక్తి ఫోన్‌ నెంబరు స్విచ్ఛాఫ్‌ రావటంటో బాధితులతో పాటు ఎస్ఐ షాకయ్యారు. తన ద్వారానే బాధితులు మోసపోవటంతో సైబర్‌ నేరం కింద ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

ఈ విషయం జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప దృష్టికి రావటంతో ఆయన విచారణ జరిపించారు. సైబర్ నేరగాడి చేతిలో తొలుత ఎస్ఐ మోసపోయినట్లు తేలింది. నిందితుడు కర్ణాటక నుంచి ఫోన్ చేసి ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసే పోలీసులు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here