ఊబిలో చిక్కుకుని ఇద్దరు యువకులు మృతి.. విషాద ఘటన

ఈత సరదా ఇద్దరిని బలితీసుకుంది. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన యువకులు స్నేహితులతో కలసి కృష్ణానదిలో ఈతకు బయలుదేరారు. ఆరుగురు యువకులు ఈతకు వెళ్లగా వారిలో ఇద్దరు ప్రమాదవశాత్తూ నదిలో మునిగిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టి గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు మండలం తోకలవానిపాలేనికి చెందిన ఆరుగురు యువకులు ఈత కొట్టేందుకు సమీపంలోని కృష్ణానదికి వెళ్లారు. వారిలో నాగకోటేశ్వరరావు(20), వెంకటేష్(18) ప్రమాదవశాత్తూ నీటమునిగారు. ఊబిలో చిక్కుకుపోవడంతో బయటికి రాలేకపోయారు. ఊపిరాడక నీటిలోనే మరణించారు.

Also Read:

తమ వెంట వచ్చిన స్నేహితులు నీటమునగడంతో ఆందోళన చెందిన స్నేహితులు విషయం గ్రామస్తులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజఈతగాళ్లను రప్పించి నదిలో గాలించి ఇద్దరి మృతదేహాలను బయటికి తీయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు యువకులు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here