ఇద్దరు దళితుల దారుణ హత్య.. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాడని కిరాతకంగా నరికి..

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడని ఆగ్రహంతో రగిలిపోయిన అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఇంటికెళ్లి మరీ ఇద్దరు దళితులను నరికి చంపిన దారుణ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. దళితుల హత్యతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను భారీగా మోహరించారు. కుల ఘర్షణలకు దారితీయకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ట్యుటికోరిన్ జిల్లాలోని ఉదయర్‌కులమ్ గ్రామానికి చెందిన పలవేశం అదే గ్రామానికి చెందిన షణ్ముగ సుందరం అనే వడ్డీ వ్యాపారి వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అందుకోసం తన ఇంటి పత్రాలను తనఖా పెట్టాడు. ఇటీవల తాను అప్పుగా తీసుకున్న డబ్బుని వడ్డీతో సహా చెల్లించిన పలవేశం ఇంటి పత్రాలు తిరిగివ్వాలని కోరాడు. అందుకు వడ్డీ వ్యాపారి షణ్ముగ సుందరం తిరస్కరించాడు.

Also Read:

తన డబ్బులు చెల్లించకుండా పత్రాలు ఎలా ఇస్తానంటూ అడ్డం తిరగడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. షణ్ముగ సుందరం అతని అనుచరులతో కలసి పలవేశంపై దాడి చేసి కులంపేరుతో తీవ్రంగా దూషించాడు. దీంతో పలవేశం పోలీసులను ఆశ్రయించాడు. తనను కొట్టి కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు షణ్ముగ సుందరంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

షణ్ముగ సుందరం వర్గీయులు కూడా పలవేశంపై కౌంటర్ కేసు పెట్టారు. అయినప్పటికీ పలవేశంని అరెస్టు చేయలేదు. దీంతో రగిలిపోయిన సుందరం సామాజిక వర్గం(తేవర్) వారు పలవేశంని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. షణ్ముగ సుందరం సోదరుడు, అతని అనుచరులు, పలువురు తేవర్ కులస్తులు పలవేశం ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న పలవేశం, అతని మేనల్లుడు తంగరాజ్‌ని కత్తులతో నరికి దారుణం చంపేశారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here