ఇంట్లో శవాలుగా మారిన జంట.. మిస్టరీగా మరణం

గిరిజన దంపతులు శవాలుగా మారిన ఘటన కలకలం రేపింది. తెల్లారేసరికి భార్యాభర్తలిద్దరూ మృతి చెందడం మిస్టరీగా మారింది. భార్యను ఊపిరాడకుండా చేసి చంపేయగా భర్త మరో గదిలో ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. తమ ముగ్గురు బిడ్డలు నిద్రపోతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లారేసరికి తల్లిదండ్రులు శవాలుగా మారడంతో చిన్నారులు షాక్‌కి గురయ్యారు. ఈ విషాద సంఘటన కేరళలోని పాలక్కడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

అట్టపాడి సమీపంలోని అంపలకున్ను గ్రామానికి చెందిన చంద్రన్(44), శాంత(31) దంపతులు ఇంట్లో శవమై కనిపించాడు. భార్యభర్తల మృతదేహాలు వేర్వేరు గదుల్లో పడి ఉన్నాయి. శాంతను ప్లాస్టిక్ వైరుతో గొంతుబిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. భర్త చంద్రన్ మరో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Also Read:

క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. భార్యని గొంతుబిగించి చంపేసినట్లు నిర్ధారించిన క్లూస్ టీం.. ఆమెను భర్తే హత్య చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. భార్యని హత్య చేసిన అనంతరం భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. తల్లిదండ్రుల మరణంతో వారి ముగ్గురు పిల్లలు మనోజ్(9), రమేష్(8), ఏడాదిన్న వయసున్న కూతురు సుని అనాథలుగా మిగిలారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here