ఆ యాప్‌లు డౌన్‌లోడ్ చేయొద్దు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక

లాక్‌డౌన్‌లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ మోసాలకు తెగబడుతున్నారు. ఈఎంఐ మారటోరియం, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు వాయిదా పేరుతో వివరాలు అడిగి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఫేక్‌ వెబ్‌సైట్లు క్రియేట్ చేసి మరీ అందినకాడికి దోచేస్తున్నారు. ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాల పేరుతోనూ ఇటీవల లక్షల్లో దోచేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్‌తో ఇళ్లలో ఉంటూ స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్న నెటిజన్లే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు వలవిసురుతున్నారు.

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోవడంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలు ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న పలు రకాల మోసాలను వివరిస్తూ అప్రమత్తంగా ఉండేందుకు పలు సూచనలు చేస్తున్నారు.

Also Read:

సైబర్ క్రిమినల్స్ ఆర్మీ, మిలిటరీ అధికారుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని.. అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బైకులు, కార్లను అతి తక్కువ ధరకే అమ్ముతామంటూ OLX వంటి యాప్‌ల ద్వారా యాడ్‌ ఇచ్చి ముందు నగదు పంపించాలని అడుగుతారని.. ఆ తరువాత పత్తా లేకుండా పోతున్న ఘటనలు జరిగాయన్నారు. ముందుగా నగదు పంపే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

అలాగే అపరిచిత వ్యక్తులు పంపిన QR Code‌లను ఎలాంటి పరిస్థితుల్లోనూ స్కాన్ చేయొద్దని.. అపరిచిత వ్యక్తులు చెప్పిన ఎనీ డెస్క్, Quick Viewr వంటి యాప్‌లు కూడా వాడొద్దని సూచిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే UPI నంబర్ ఎవరికీ చెప్పొద్దని పోలీస్ శాఖ అధికారులు తెలిపారు. ఎవరైనా ఆన్‌లైన్ మోసాలకు గురైతే www.cybercrimes.gov.in లేదా హెల్ప్ లైన్ నంబర్ కు 155260కి ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞపి చేశారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here