ఆ భారం కాంగ్రెస్ పార్టీదే.. వలస కార్మికులపై సోనియా గాంధీ లేఖ

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్‌తో వలస కూలీల పరిస్థితి దారుణంగా మారింది. ఉన్నచోట ఉండలేక… సొంతూళ్లకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. పొట్ట చేత పట్టుకొని… కాలిబాటన వందల కిలోమీటర్లు నడుస్తూ… సొంతూరికి పయనమవుతున్నారు. వలసకార్మికుల కష్టాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు ఈమేరకు ఆమె ఓ లేఖ రాశారు. వలస కార్మికులే దేశానికి వెన్నముక అన్నారు. వలస కూలీల కష్టం, త్యాగం మన దేశానికి పునాది అన్నారు. వలస కార్మికుల ప్రయాణ ఖర్చు స్థానిక కాంగ్రెస్ నేతలే భరించాలన్నారు సోనియా. విదేశాల్లో ఉన్న వారిని ఫ్రీగా దేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వాలు… ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికుల్ని ఉచితంగా సొంతూళ్లకు పంపాలేదా అంటూ ఆమె ప్రశ్నించారు.

నాలుగు గంటల సమయం ఇచ్చి లాక్ డౌన్ విధించారని సోనియా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లకుండా ఇబ్బందులు పడటానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కారణమన్నారు. ఏం చేశారో ఇప్పుడు అదే చేశారని ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ నేతలే వలస కార్మికులకు భరోసా ఇవ్వాలని సోనియా పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే మరోవైసు వలస కార్మికుల వెతలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడికక్కడ వలస కార్మికులంతా రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగుతున్నారు. తమను తమ గ్రామాలకు పంపాలంటూ అధికారుల్ని, ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఆందోళనకు దిగుతున్న విషయం కూడా తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు ఇప్పటివరకూ 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. వలసకూలీలు, విద్యార్థులు, ఇతర ప్రజలను తరలించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఈ రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here