ఆరేళ్ల చిన్నారిపై రేప్.. బ్రతికుండగానే కళ్లు పీకేసి పాశవికంగా

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడు.. ఆమె పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. తనను చూసిందన్న కోపంతో బ్రతికుండగానే ఆమె కళ్లు పీకేసి అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని దామోలో బుధవారం జరిగింది. దామో ప్రాంతానికి చెందిన ఆరేళ్ల చిన్నారి బుధవారం ఇంటి బయట ఆడుకుంటోంది.

Also Read:

ఆమెను గమనించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. పాప కనిపించకపోవడంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం ఓ ప్రాంతంలో తీవ్రగాయాలతో పడివున్న చిన్నారిని గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు చెప్పారు. వారి సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Also Read:

బాలికపై చేసిన నిందితుడు ఆమె కళ్లు పీకేశాడని, సర్జరీ చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. చిన్నారిపై అతడు అత్యంత దారుణంగా ప్రవర్తించినట్లు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో అనుమానం ఉన్న అందరిని విచారిస్తున్నామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here