ఆటోను ఢీకొట్టిన ఉల్లిపాయల లారీ.. గుంటూరులో విషాదం

గుంటూరులో ఘోర చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజాము సమయంలో మండల పరిధిలోని టోల్‌ప్లాజ్ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్రక్కు ఆటోను ఉల్లిపాయల లోడు లారీ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది.

లారీ ఢీకొన్న ధాటికి ఆటో పల్టీలు కొట్టడంతో అందులో ఉన్న ఇద్దరు గాయాల పాలయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో జీజీహెచ్‌కి తరలించారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here