అమ్మ తిట్టిందని పిచ్చితల్లి అఘాయిత్యం.. వికారాబాద్‌లో విషాదం

అమ్మ తిట్టిందని మతిస్థిమితం లేని కూతురు అఘాయిత్యం చేసుకుంది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి బయట గడియపెట్టి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో కాలిపోయింది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వచ్చి మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. ఈ అత్యంత విషాద ఘటన వికారాబాద్‌ జిల్లాలో జరిగింది.

పెద్దేముల్ మండలం కందనెల్లికి చెందిన అరిగె శ్రీలత(25)కు కొద్దికాలంగా మతిస్థిమితం లేదు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండేది. రాత్రి పదిన్నర గంటల సమయంలో ఇంటి బయట పడుకుని ఉన్న శ్రీలతని ఆమె తల్లి శాంతమ్మ లోపలికి వచ్చి పడుకోమని పిలిచింది. శ్రీలత ఇంట్లోకి రాననడంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో తల్లి మందలించింది. అనంతరం ఇంట్లోకి వెళ్లి నిద్రించింది.

Also Read:

అమ్మ తిట్టిందని తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీలత కుటుంబ సభ్యులు నిద్రపోయిన తరువాత కిరోసిన్ డబ్బా తీసుకుని బయటకు వచ్చింది. ఇంటి బయట గడియపెట్టి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో కాలిపోతూ కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే కాలిన గాయాలతో ఆమె మృతి చెందింది.

సమాచారం అందుకున్న పోలీసులు కందనెల్లి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here