అమ్మాయిని వేధిస్తున్నాడని.. బంధువునే కారుతో ఢీకొట్టించి దారుణహత్య

కంభంలో జరిగిన యువకుడి దారుణహత్య కేసును పోలీసులు చేధించారు. తనను చంపుతాడనే భయంతోనే కాశీశ్వరయ్యను కారుతో ఢీకొట్టి హతమార్చినట్టు పోలీసుల విచారణలో నిందితుడు కరుణాకర్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా మండలం పోరుమామిళ్లపల్లి‌కి చెందిన కాశీవిశ్వేశ్వరరావు విజయవాడలోని ముత్తూట్ ఫైనాన్స్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. గోవిందాపురం గ్రామానికి చెందిన వెంకటకరుణాకర్‌ అతడికి బంధువు. విజయవాడలో ఉంటున్న కరుణాకర్‌ మేనకోడలిని కాశీవిశ్వేశ్వరరావు తరచూ వెంటపడి వేధించేవాడు. దీంతో ఇద్దరి మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయి. దీనిపై ఒకరికొకరు పోలీస్‌స్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు.

Also Read:

శుక్రవారం వారిద్దరూ తమ స్నేహితులతో వేర్వేరుగా మద్యం సేవిస్తున్న సమయంలో కాశీవిశ్వేశ్వరరావుకు కరుణాకర్‌ ఫోన్‌ చేసి మందలించాడు. తన మేనకోడలి జోలికి మరోసారి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి చంపేస్తామని బెదిరించుకున్నారు. తనను చంపేందుకు కాశీవిశ్వేశ్వరరావు ఆయుధంతో బైక్‌పై వస్తున్నాడని తెలుసుకున్న కరుణాకర్.. కారుతో అతడిని ఢీకొట్టాడు. అతడు చనిపోలేదని నిర్ధారించుకున్న కరుణాకర్.. మరోసారి కారుతో ఢీకొట్టి ప్రాణాలు తీశాడు.

Also Read:

అనంతరం నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు హతుడు కాశీవిశ్వేశ్వరరావు, నిందితుడు కరుణాకర్‌ సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్‌ రికార్డులను పరిశీలిస్తున్నారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, మార్కాపురం సీఐ, ఎస్‌ఐ మాధవరావు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here