అప్పు తీర్చమని అడిగినందుకు హత్య.. వరంగల్‌లో దారుణం

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భీమారంలోని సదానందకాలనీ రోడ్డు నెంబర్‌-1లో బుధవారం తెల్లవారుజామున హరి(35)అనే వ్యక్తిని సురేశ్ అనే కారు డ్రైవర్ చంపేశాడు. ఆంధ్రప్రదేశ్‌‌లోని విజయవాడకు చెందిన హరిబాబు వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన తన అక్క ఇంట్లో ఆరేళ్లుగా ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన కారు డ్రైవర్‌ సురేశ్‌తో అతడికి పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. దీంతో సురేశ్‌కు కొంత సొమ్ము అప్పుగా ఇచ్చాడు.

Also Read:

లాక్‌డౌన్ కారణంగా తనకు డబ్బు అవసరముందని, అప్పు తిరిగి చెల్లించాలని హరి కొద్దిరోజులుగా సురేశ్‌ ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం హరిబాబు సురేశ్‌ ఇంటికి వెళ్లగా ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత తన బాకీ తీర్చాలని హరిబాబు సురేశ్‌పై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. సురేశ్‌ ఆవేశంలో కూరగాయలు కోసే కత్తితో హరిబాబు గొంతు, ఛాతీ భాగంలో విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో హరి అక్కడికక్కడే చనిపోవడంతో నిందితుడు కేయూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here