అత్తింటివాళ్లను రోకలితో కొట్టిన వ్యక్తి.. భార్య మృతి, ఐసీయూలో అత్త

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, అత్తపై రోకలితో దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటనలో భార్య అక్కడిక్కడే మృతి చెందగా, అత్త తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతోంది. జిల్లా నాచారం గ్రామానికి చెందిన చేపలమడుగు మురళికి వేంసూరు మండలం దుద్దెపూడికి చెందిన రాణి(22)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కూతురు. మద్యం, ఇతర వ్యసనాలకు బానిసైన మురళి కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

Also Read:

రెండ్రోజుల క్రితం రాణి భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. భార్య కోసం మురళి మంగళవారం అక్కడికి వచ్చి ఇంటికి రమ్మని అడగ్గా చెడు వ్యసనాలు మానేవరకు రానని చెప్పింది. ఇదే విషయంపై దంపతులమ ధ్య మంగళవారం రాత్రి మళ్లీ గొడవ జరగ్గా.. రాణి తల్లి మంగమ్మ సర్దిచెప్పేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన మురళి రోకలి బండతో భార్య, అత్తపై దాడి చేయగా రాణి అక్కడిక్కడే మృతి చెందింది. మంగమ్మ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లి చనిపోవడం, తండ్రి హంతకుడిగా మారడంతో ఆ చిన్నారి అనాథగా మిలిగింది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here