స్కూల్లో వీరంగం సృష్టించ‌న డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత హ‌డావిడి చేస్తాడో మ‌న‌కంద‌రికి తెలిసిందే. అయితే ఓ స్కూల్ విజిట్ కి వెళ్లిన ట్రంప్ పిల్ల‌ల‌తో స‌ర‌దాగా ఆడుకుంటూ అక్క‌డి ప్ర‌తినిధుల‌తో గొడ‌వ‌ప‌డిన‌ట్లుగా ఉన్న ఓ వీడియో వైర‌ల్ అవుతుంది. అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పబ్లిక్ మీటింగ్ తో కానీ, మీడియా ప్రతినిధుల‌తో ముచ్చ‌టించేట‌ప్పుడు ఎంత హంగామాచేస్తాడో ప‌లు సంద‌ర్భాల్లో చూసే ఉంటాం. ఆయ‌న మాట‌తీరు. సైగ‌లు చేసే తీరు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ నేప‌థ్యంలో అమెరికాలో స్కూల్లో విద్యార్ధుల‌కు బోధ‌న ఎలా ఉంది అని తెలుసుకునేందుకు ఓ స్కూల్ ప‌ర్య‌ట‌న కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

ఆ స్కూల్లో ప‌ర్య‌టించిన ట్రంప్ చిన్నారుల‌తో మాట్లాడి. వారితో ఆట‌లాడాడు. మ‌న‌కు వేరే మీటింగ్ ఉంద‌ని ఓ ప్ర‌తినిధి చెప్ప‌గా .. బాల్ పై కూర్చున్న ట్రంప్ గింగరాలు తిరుగుతూ వీరంగం సృష్టించాడు. వ‌ద్దు సార్ మ‌న స‌మ‌యం మించిపోతుంది అన్నా ప‌ట్టించుకోకుండా స్కూల్ ఫ్లోర్ మీద ప‌డుకొని , బాల్ ను అటూ ఇటూ తిప్పుతు హ‌డావిడి చేశాడు. ఆ వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. స్కూల్లో ట్రంప్ చేసిన ఘ‌న‌కార్యం ఎలా ఉందో చూడండి అని షేర్ చేస్తుంటే మ‌రికొంత‌మంది ట్రంప్ ట్రోల్ చేసి ఇలా వీడియోలో ఫేస్ క‌న‌బ‌డ‌కుండా మాస్క్ వేశార‌ని..అత‌ను ట్రంప్ కాద‌ని..ట్రంప్ లా ఉండే మ‌రొక వ్య‌క్తని సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here