మోదీ నిర్ణ‌యం.. జ‌గ‌న్ అభినంద‌న‌లు

వ్య‌వ‌సాయ మౌలిక స‌దుపాయాల నిధిని ల‌క్ష కోట్ల‌తో ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం జగ‌న్ మోహ‌న్ రెడ్డి పీఎం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు.

ల‌క్ష కోట్ల‌తో పంట ఉత్ప‌త్తుల నిల్వ కోసం శీత‌ల గిడ్డంగులు, పంట సేక‌ర‌ణ కేంద్రాలు,  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు త‌దిత‌ర వాటి ఏర్పాటు చేస్తారు. వీటి కోసం కేంద్ర ప్ర‌భుత్వం 11 ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌తో ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ సంద‌ర్బంగా ముఖ్యమంత్రి వై.ఎస్ జ‌గ‌న్ న‌రేంద్ర‌మోదీకి అభినంద‌న‌లు తెలిపారు.

ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన ఆయ‌న రైతుల పంట‌ల‌కు విలువ‌ను జోడించ‌డానికి స్థిర‌మైన ఉన్న‌త‌స్థాయి ఆదాయాలు పొంద‌డానికి ఈ నిధి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ ఆర్థిక వ్య‌వ‌స్థ మెరుగుప‌డేందుకు తోడ్ప‌డుతుంద‌ని జ‌గ‌న్ ఆకాంక్షించారు.

జ‌గ‌న్‌తో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here