జ‌గ‌న్‌తో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ..

విజ‌య‌వాడ‌లో కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో జ‌రిగిన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్పందించారు. ఈ విష‌యంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో మాట్లాడారు.

విజ‌య‌వాడ‌లో ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్ హోట‌ల్‌ను లీజుకు తీసుకుంది. ఇందులో కోవిడ్ పేషెంట్ల‌ను ఉంచింద‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌ధానికి వివరించారు. తెల్ల‌వారుజామున ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగిందని.. అయితే విష‌యం తెలిసిన వెంట‌నే స్పందించి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు.

అధికారులు వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన‌డంతో భారీ ప్రాణ న‌ష్టం త‌ప్పింద‌న్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ప‌లువురు చ‌నిపోయార‌ని.. వీరి కుటుంబాల‌ను ఆదుకునేందుకు రూ. 50 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించామ‌న్నారు. అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌ధానికి జ‌గ‌న్ వివ‌రించారు.

కాగా ర‌మేష్ హాస్పిట‌ల్ యాజ‌మాన్యం ఓ హోట‌ల్‌ను లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా చేసింది. రాత్రి భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here