ప్ర‌మాదంపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌..

విజ‌య‌వాడ‌లో కోవిడ్ కేర్ సెంట‌ర్ ప్రమాదంపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు. ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిన వెంట‌నే ఆయ‌న అధికారుల‌ను అలెర్ట్ చేశారు.

కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు 11 మంతి మృత్యువాత‌ప‌డ్డారు. అయితే
కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా ఓ హోట‌ల్ ఉన్న విష‌యంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధికారుల‌తో మాట్లాడారు. ప్రమాదం ఎలా జ‌రిగింది, త‌క్ష‌ణం తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై అధికారుల‌కు మార్గ‌నిర్దేశం చేసిన‌ట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఘ‌ట‌న‌పై లోతుగా విచార‌ణ జ‌ర‌పాల‌ని జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు త‌న‌కు తెలియ‌జేస్తూ ఉండాల‌ని చెప్పారు.

ఇక ఈ ప్ర‌మాదంపై ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు కూడా స్పందించారు. క్వారంటైన్ కేంద్రంలో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డం బాధాకర‌మ‌న్నారు. ఘ‌ట‌న‌పై ఆయ‌న దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here