ప్ర‌మాదంపై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాలి.. ప‌వ‌న్ క‌ల్యాణ్

విజ‌య‌వాడ కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ స్పందించారు. ఘ‌ట‌న‌కు సంబంధించి స‌మ‌గ్ర విచార‌ణ చేయాల‌న్నారు.

కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డం హృద‌య విదార‌క‌మ‌ని ప‌వ‌న్ అన్నారు. విష‌యం తెలియగానే తీవ్ర దిగ్బ్రాంతికి లోనైట్లు తెలిపారు. క‌రోనా చికిత్స కోసం చేరిన వారు ఇలా ప్ర‌మాదానికి గుర‌వ్వ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌న్నారు.

మృతుల కుటుంబాల‌కు జ‌న‌సేన పార్టీ త‌రుపున ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. అయితే ప్ర‌మాదానికి సంబంధించి కార‌ణం ఏంట‌న్న దానిపై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల‌న్నారు. హోట‌ళ్లు, భ‌వ‌నాల్లో కోవిడ్ కేర్ సెంట‌ర్లు నిర్వ‌హిస్తున్న చోట్ల రక్ష‌ణ చ‌ర్య‌ల‌పై స‌మీక్షించాల‌ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here