రానా పెళ్లిలో రాంచ‌ర‌ణ్ ఏం చేశారో తెలుసా..?

హీరో రానా బ్యాచిల‌ర్ జీవితానికి ముగింపు ప‌డింది. శ‌నివారం రాత్రి ఆయ‌న వివాహం జ‌రిగింది. కుటుంబ స‌భ్యులు, ప‌రిమిత బంధువులు స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఆయ‌న పెళ్లి జ‌రిగింది.

ద‌గ్గుపాటి రానా, త‌న ప్రియురాలు మిహీకా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకున్నారు. రామానాయుడు స్టూడియోలో ఆయ‌న వివాహ కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగా ముగిసింది. ఈ కార్య‌క్ర‌మానికి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు అత్యంత స‌న్నిహితులు మాత్రమే హాజ‌ర‌య్యారు.

వెంక‌టేష్, నాగ‌చైత‌న్య దంప‌తులు, రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌, అల్లుఅర్జున్‌, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌లు వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ముందుగా నిర్ణ‌యించిన విధంగానే అతి త‌క్కువ సంఖ్య‌లోనే పెళ్లికి హాజ‌ర‌య్యారు. అయితే వ‌ర్చువల్‌ రియాలిటీ కిట్లు ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ఉన్నాయ‌ని చెప్పొచ్చు. బంధువులు, సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారు రానాకు శుభాకాంక్ష‌లు తెలిపారు. రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు వ‌ధూవ‌రుల‌తో ప్ర‌త్యేకంగా ఫోటోలు దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here