ప్ర‌భుత్వం సీరియ‌స్‌.. ఇక ఆ ఆసుప‌త్రుల భ‌విష్య‌త్తేంటి..?

విజ‌య‌వాడ ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో జ‌రిగిన ప్ర‌మాదంపై రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఘ‌ట‌న‌కు సంబంధించి కేర్ సెంట‌ర్ నిర్ల‌క్ష్యం ఉంద‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. 48 గంట‌ల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం కమిటీ వేసింది.

ఘ‌ట‌న జ‌రిగిన హోట‌ల్‌తో పాటు రమేష్ హాస్పిట‌ల్‌పై 304, 308 రెడ్‌విత్ 34 సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేశారు. ప్ర‌మాదానికి కార‌కులైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ విష‌యంపై మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో 138 ఆస్ప‌త్రుల్లో క‌రోనా సౌక‌ర్యాలు అందిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ ప్ర‌మాదంపై నివేదిక వ‌చ్చిన త‌ర్వాత  అన్ని హాస్పిట‌ల్స్‌పై డ్రైవ్ నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

ఇక కోవిడ్ కేర్ సెంట‌ర్‌ మృతుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం రూ. 50 లక్ష‌లు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ప్ర‌మాదంపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here