జ‌గ‌న్ స‌ర్కార్ కోవిడ్ కోసం ఏం చేస్తోందో తెలుసా…

రాష్ట్రంలో కోవిడ్ బాదితుల చికిత్స కోసం వెయ్యి కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. ఈ మేర‌కు కోవిడ్‌పై ఆయ‌న స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించి, అధికారుల‌కు కీల‌క ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో అన్నిచ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. బాదితుల చికిత్స‌ల కోసం రాష్ట్రంలో మ‌రో 54 హాస్పిట‌ల్స్ ఏర్పాటు చేస్తామ‌ని సీఎం తెలిపారు. రాష్ట్ర స్థాయిలో క్రిటిక‌ల్ కేర్ స‌దుపాయాలను ఐదు ఆస్ప‌త్రుల్లో క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. ప్ర‌తి రోజు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.5 కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌న్నారు.

రోజురోజుకూ క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో సీఎం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై అధికారులు, ప్ర‌జ‌ల్లో క‌రోనాను ఎదుర్కోగ‌ల‌మ‌నే న‌మ్మ‌కం ఏర్ప‌డుతున్న‌ట్లు ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఈ త‌రుణంలో ముఖ్య‌మంత్రి ఈ విధంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఇంకా మంచిదంటున్నారు.  ఇక సీఎం మాట్లాడుతూ కోవిడ్ బాదితుల కోసం 2300 క్రిటిక‌ల్ కేర్ బెడ్లు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. రాబోయే ఆరునెల‌ల్లో వెయ్యి కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తామ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here