ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితుల‌ను బ‌య‌ట‌పెట్టిన న‌టి ప్రియ‌మ‌ణి

ఎన్నాళ్లు తిని కూర్చుంటాం.. ప‌నులు చేసుకోక త‌ప్ప‌దంటోంది న‌టి ప్రియ‌మ‌ణి. లాక్‌డౌన్‌లో కుటుంబంతో గ‌డిపే చాన్స్ దొరికింద‌ని చెప్పుకొచ్చింది. మ‌ళ్లీ షోలు స్టార్ట‌య్యాయి క‌నుక బిజీ అవ్వాల్సి వ‌స్తోందంటోంది.

తాను విరాట‌ప‌ర్వం, నార‌ప్ప చిత్రాల‌తో త్వ‌ర‌లోనే ముందుకొస్తాన‌ని ప్రియ‌మ‌ణి తెలిపింది. అయితే ఈ సినిమాల్లో న‌క్స‌లైట్ పాత్ర ఎలా ఉండాల‌నేది ద‌ర్శ‌కుడే నిర్ణ‌యించారు. అంతే త‌ప్ప తాను ఎవ్వ‌రి దగ్గ‌ర శిక్ష‌ణ తీసుకోలేద‌ని తెలిపింది. ఈ సినిమాల షూటింగ్ ఇంకా పూర్తికావాల్సి ఉంద‌ని ప్రియ‌మ‌ణి వివ‌రాలు వెల్ల‌డించారు.

ఇక ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయ‌ని.. ఎవ‌రి స్టార్‌డంకి త‌గ్గట్టు వారు పారితోషికాలు తీసుకుంటున్నార‌ని చెప్పారు ప్రియ‌మ‌ణి. త‌న‌కు మంచి స‌పోర్టు ఇచ్చే కుటుంబం ఉందని.. అందుకే కెరీర్‌లో రాణిస్తున్నాన‌ని తెలిపారు. ఇక అతిథి అనే హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ లో న‌టించినా అది లాక్ డౌన్ కార‌ణంగా రిలీజ్ అవ్వ‌లేద‌న్నారు. తాజాగా మ‌ల‌యాలంలో రియాలిటీ షో కి ఓకే చెప్పారు ప్రియ‌మ‌ణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here