రాహుల్‌గాంధీ ఫైర్‌..ఎంత చెప్పినా విన‌డం లేదు..?

కేంద్ర ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. ప్రధాన మంత్రి త‌న సొంత ఇమేజ్‌ను పెంచుకునేందుకు దృష్టి పెడుతున్నార‌న్నారు.

కోవిడ్ 19 ఆర్థిక వ్య‌వ‌స్థ దీన స్థితిపై తాను ముందు నుంచీ హెచ్చ‌రిస్తూనే ఉన్న‌ట్లు చెప్పారు. ఎలాంటి ప‌రిస్థితులు ఎదురయ్యాయో చూశామ‌న్నారు. త‌న మాట‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పెడ‌చెవిన పెట్టింద‌న్నారు. దేశంలో క‌రోనా ప‌రిస్థితులు, ఆర్థిక వ్య‌వ‌స్థ‌, త‌దిత‌ర అంశాల‌పై ఈమ‌ధ్య రాహుల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా మాట్లాడుతూనే ఉన్నారు.

ఇప్పుడు ఇదే విష‌యాన్ని ఆయ‌న చెబుతున్నారు. చైనాతో స‌రిహ‌ద్దు వివాదం గురించి సైతం ఆయ‌న మాట్లాడారు. దేశంలో వ్య‌వ‌స్థ‌లు త‌మ సొంత ప్ర‌తిష్ట‌ను పెంచుకునేందుకు దృష్టిపెట్టాయ‌న్నారు. చైనా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నా వినిపించుకోవడం లేద‌ని విమ‌ర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here