స్టే ఇవ్వ‌లేం.. సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

రాష్ట్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టులో మ‌ళ్లీ ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లైంది. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ వ్య‌వ‌హారంలో ఇది జ‌రిగింది. కోర్టు దిక్క‌రణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో పిటిష‌న్‌ దాఖ‌లు చేసింది.

ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై నేడు విచార‌ణ జ‌ర‌గ్గా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎస్‌.ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచారించింది. ఈ కేసుకు సంబంధించి ప్ర‌తి విష‌యం మాకు తెలుస‌ని, మేం కావాల‌నే ఈ కేసులో స్టే ఇవ్వ‌ట్లేద‌ని ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. గ‌వ‌ర్న‌ర్ లేఖ పంపినా ర‌మేష్ కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వ‌క‌పోవ‌డం అత్యంత దారుణ‌మ‌ని సీజేఐ వ్యాఖ్యానించారు.

నిమ్మ‌గ‌డ్డ నియామ‌కానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా నిరాక‌రించామ‌ని సీజేఐ గుర్తుచేశారు. హైకోర్టు ఉత్త‌ర్వుల‌పై స్టే ఇచ్చేందుకు నిరాక‌రిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here