ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్న స్టార్ యాక్టర్స్

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఏ నోట చూసినా ఒక్క‌టే మాట వినిపిస్తోంది. అదే ఓటీటీ. నెమ్మ‌దిగా ఇప్పుడు అంద‌రూ ఓటీటీపైనే ప‌డుతున్నారు. సినిమాలు తీస్తూ ఓటీటీలో వ‌దిలేస్తున్నారు. తాజాగా ర‌కుల్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది.

అస‌లు ఓటీటీ అంటే చాలా మందికి తెలియదు. ఓటీటీ(ఓవ‌ర్ ది టాప్). మ‌నం యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు చూస్తుంటాం. అయితే ఓటీటీ అనేది ఒక యాప్‌. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే అందులో ఎన్నో వీడియోలు ఉంటాయి. అయితే దీన్ని చూడ‌టానికి మ‌నం ప్ర‌తి నెలా కొంత డ‌బ్బు క‌ట్టాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైం, హాట్ స్టార్ ఇలాంటివే.

దీని వ‌ల్ల మ‌నం థియేట‌ర్ల‌కు వెళ్ల‌కుండా ఎంచ‌క్కా ఇంట్లోనే కూర్చొని మ‌న‌కు కావాల్సిన వీడియోలు చూడొచ్చు. న‌చ్చిన సినిమాల‌ను సీన్ల‌ను ఎన్ని సార్లైనా చూసుకునే వీలుంటుంది. మామూలుగా సినిమా రిలీజైన నెల రోజుల‌కు ఇందులో వ‌చ్చేది. ఇప్పుడు ఏకంగా ఓటీటీలోనే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న సామాజిక దూరం అనే ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌కు వెళ్లాలంటేనే జ‌నం జంకుతారు. ఈ నేపథ్యంలో ఓటీటీల‌కు భారీగా డిమాండ్ రానుంది. అందుకే పెద్ద పెద్ద నిర్మాత‌లంతా ఇప్పుడు సొంతంగా ఓటీటీ పెట్టే ప్లాన్‌లోనే ఉన్నారు.

ఇక స్టార్ హీరోలు సైతం త‌మ స‌మ‌యాన్ని వృథా చేసుకోకుండా ఓటీటీలోనే సినిమాలు విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక స‌మంత, త‌మ‌న్న‌, కాజ‌ల్ వంటి హీరోయిన్లు ఇప్ప‌టికే వెబ్ సిరీస్‌ల‌కు జై కొట్టారు. ఈ కోవ‌లోకే ఇప్పుడు ర‌కుల్ కూడా చేరిపోయింది. మ‌రి ఈ ఓటీటీలు ఎంత త్వ‌ర‌గా పాపుల‌ర్ అవ్వ‌బోతున్నాయో తెలుసుకోవాలంటే ఇంకొన్నిరోజులు ఆగితే స‌రిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here