స్వాతంత్య్ర వేడుకలపై కేంద్రం రాష్ట్రాలకు లేఖ

ప్రతి సంవత్సరం మనదేశంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా లక్షల మంది ప్రజలు ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం స్వాతంత్ర్య వేడుకలను భిన్నంగా చేయాలని కేంద్రం నిర్ణయించింది.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఒకే చోట ఉండి వేడుకలు చూస్తే మంచిది కాదు. ఒకవేళ సామాజిక దూరం పాటిస్తూ వేడుకలు చేద్దామన్నా స్థలం సరిపోదు. ఈ నేపథ్యంలో కేంద్రం వేడుకల నిర్వహణకు ప్రణాళిక రూపొందించింది. అందరూ వీక్షించేందుకు ఆన్ లైన్, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయనున్నారు.

ఎర్రకోట వద్ద ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు.. అక్కడ నిర్వహించే కవాతు గౌరవ వందనం కార్యక్రమాలను వెబ్ క్యాస్టింగ్ విధానంలో ప్రసారం చేస్తారు. ఎక్కువ మంది చూసేలా ఆన్ లైన్, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తారు. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. జనం ఎక్కువ సంఖ్యలో గుమి కూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

అయితే ఈ ఏడాది వేడుకల్లో మాత్రం కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రదర్శనలో కనిపించేలా చూడలంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here