కేటీఆర్ కు ‌ఏపీ సీఎం వై.ఎస్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

ఏపీ సీఎం వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలంగాణ మంత్రి కే.టీ.ఆర్‌కు మెసేజ్ చేశారు. అయితే ఆయ‌న‌కు నేరుగా మెసేజ్ చేయ‌లేదు కానీ ట్విట్ట‌ర్‌లో ఆయ‌న‌కు చేరేలా మెసేజ్ చేశారు.

ఇవాళ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (కేటీఆర్‌) బ‌ర్త్‌డే. దీంతో ఆయ‌న‌కు ఏపీ నుంచి శుభాకాంక్ష‌ల మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఏపీ సీఎం జ‌గ‌న్ కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ ద్వారా విష్ చేయ‌డం వైర‌ల్ అవుతోంది.

ప్రియ‌మైన సోద‌రుడు తారక్‌కు పుట్టిన రోజు శుబాకాంక్షలు. దేవుడు మీకు ఆరోగ్యాన్ని సంతోషాన్ని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నా.. అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు. వెంట‌నే కేటీఆర్ ధ‌న్యవాదాలు అన్న అని రిప్లై ఇచ్చారు. జ‌గ‌న్‌తో పాటు ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని కూడా కేటీఆర్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే జ‌గ‌న్ ట్వీట్ చేయ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. జ‌గ‌న్‌, కేసీఆర్ ఫ్యామిలీల మ‌ధ్య మంచి స్నేహ పూర్వ‌క అనుబంధం ఉన్నందువ‌ల్లే సీఎం హోదాలో ఉండి కూడా కేటీఆర్‌కు మ‌న‌స్పూర్తిగా శుభాకాంక్ష‌లు తెలిపార‌ని చ‌ర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here