ఈ ఎంపీ ఆరాటమంతా కేసుల రారాజు కోసమేనా…?

క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణంరాజు ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. అది ఎందుకంటే ఆయ‌న వైసీపీ ఎంపీ అని. అయితే ఇప్పుడు అది మారింది. ఆయ‌న వైసీపీ నుంచి గెలిచినా.. గెలిచిన పార్టీని ధిక్క‌రిస్తున్నారు. ఈ వైఖ‌రే ఇప్పుడు ఏపీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేసి ర‌ఘురామ‌కృష్ణం రాజు గెలుపొందారు. 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ నుంచి గెలిచి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అయితే ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కే ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. గెలిచిన వైసీపీనే కాద‌ని ఇత‌ర పార్టీల‌కు సపోర్టు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఎంపీగా గెలిచిన త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు మంచిచేసే నాయ‌కుల‌ను మ‌నం చూసింటాం కానీ సొంత పార్టీపైనే విమ‌ర్శ‌లు చేస్తూ బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చిన నాయ‌కుల్లో ఒక‌రిగా ఈయ‌న మిగిలిపోయారు.

సొంత పార్టీలో ఉంటూనే ఇత‌ర పార్టీల‌కు స‌పోర్టు చేయ‌డమే ఈయ‌న ల‌క్ష్యంగా పెట్టుకున్నారా అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పైగా పార్టీ అధినేత‌పై త‌న‌కు ఎలాంటి ధ్వేషం లేదంటూనే ఇన్‌డైరెక్టుగా కామెంట్లు చేయ‌డం ర‌ఘురామ‌కు అల‌వాటుగా మారిపోయింది. అయితే ఈయ‌న వ్య‌వ‌హార‌శైలిపేనే ఇప్పుడు అంద‌రి దృష్టీ ఉంది. ఎందుకంటే ఇప్ప‌ట‌కే పార్టీ మారాల్సిన వ్య‌క్తి ఇంకా ఎందుకు ఆల‌స్యం చేస్తున్నారోన‌ని ఏపీ రాజ‌కీయాల్లో డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. 2019 ఎన్నిక‌ల విష‌యానికొస్తే ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తార‌ని అంతా అనుకున్నారు..

అయితే అంత‌లో ఏమైందో కానీ ఆయ‌న వెంట‌నే బీజేపీలో చేరిపోవ‌డం.. ఆ త‌ర్వాత టిడిపిలోకి వెళ్ల‌డం జ‌రిగింది. మ‌ళ్లీ చివ‌ర‌కు వైసీపీలోకి వ‌చ్చి న‌ర‌సాపురం లోక్‌స‌భ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈయ‌న‌కు 4,47,594 ఓట్లు ఎన్నిక‌ల్లో వ‌చ్చాయి. ప్ర‌త్య‌ర్థికి గ‌ట్టి పోటీ ఇచ్చిన ఈయ‌న జ‌గ‌న్‌పై అభిమానంతోనే ఇంత స్థాయిలో ఉన్నార‌ని అంద‌రూ చెబుతారు. అయితే ఈయ‌న మాత్రం కేవ‌లం త‌న మొహం చూసే ఓటేశారు త‌ప్ప జ‌గ‌న్ చేసిందేమీ లేద‌ని అంటున్నారు. అయితే ప్ర‌జ‌ల‌కు తెలుసు ఎవ‌రికి ఎలా ఓటేశామోన‌ని.

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే ఎన్నిక‌ల‌కు ముందే పార్టీలు మారిన ఈ నాయ‌కుడు ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ల‌బోతున్నార‌ని ఆస‌క్తిగా మారింది. అయితే ఏపీలో టిడిపి ప‌రిస్థితి దారుణంగా ఉన్న ప‌రిస్థితుల్లో క‌చ్చితంగా బీజేపీలోకి వెళ‌తార‌ని అనుకుంటున్నారు. అయితే దీనికి ఇంకా ముహూర్తం కుద‌ర‌లేదేమో అనిపిస్తుంది. అయితే ఇక్క‌డ ఆలోచించాల్సిన విష‌యం ఇంకోటి ఉంది. చంద్ర‌బాబుతో ఈయ‌న‌కు చాలా అవ‌స‌రం ఉన్న‌ట్లు ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతోంది. ఎందుకంటే ఈయ‌న భారీ ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించిన కేసు వేధిస్తూ ఉంది. ఇది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియ‌దు.

ర‌ఘురామ‌కృష్ణం రాజుకు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. విద్యుత్ కేంద్రాల నిర్వ‌హ‌ణ‌లో ఆయ‌న‌ది అందెవేసిన చెయ్యి. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి ఆయ‌న విద్యుత్‌ను కూడా స‌ర‌ఫ‌రా చేశారు. అయితే త‌మిళ‌నాడు ఎల‌క్ట్రిసిటీబోర్డు నుంచి ఆయ‌న‌కు రావాల్సిన బిల్లులు నిలిచిపోయిన‌ట్లు ప‌లు పుకార్లు ఉన్నాయి. అయితే ఆయ‌న బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు చెల్లించాల్సి రావ‌డంతో అస‌లు చిక్కు మొద‌లైంది. కోట్లాది రూపాయ‌లు క‌ట్ట‌క‌పోవ‌డంతో ఆయ‌న‌పై సీబీఐ కేసు న‌మోదు చేసింది. దీనిపై 2019లో హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలోని ఎమ్మార్ ప్రాప‌ర్టీస్‌లోని ఆయ‌న ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది. బెంగుళూరు నుంచి వ‌చ్చిన సీబీఐ అధికారులు దాదాపు 3 గంట‌ల పాటు ర‌ఘురామ‌కృష్ణం రాజు ఇంట్లో సోదాలు చేసి ప‌లు కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నార‌ని తెలుస్తోంది.

అయితే ఈ విష‌యంపై ర‌ఘురామ మాత్రం చాలా సింపుల్‌గా తీసి ప‌డేశారు. త‌న‌కు అప్పులు ఉన్న‌మాట వాస్త‌వ‌మే కానీ వ‌న్‌టైం సెటిల్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నా అని ఆయ‌న అప్ప‌ట్లో చెప్పారు. త‌న ప‌వ‌ర్ ప్రాజెక్టు న‌ష్టాల్లో ఉన్నందున రుణాలు చెల్లించ‌లేక‌పోయాన‌ని తెలిపారు. త‌మిళ‌నాడు ఎల‌క్ట్రిసిటీ బోర్డును త‌న‌కు రావాల్సిన పేమెంట్ల గురించి అడిగితే 8వేల కోట్లు లాస్‌లో ఉన్నామ‌ని దిక్కున్న‌చోట చెప్పుకోవాల‌ని చెప్పిన‌ట్లు ఆయ‌న తెలిపారు. దీంతో ర‌ఘురామ అప్పిలేట్ ట్రిబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించారు. అయితే వాళ్లు మాత్రం త‌న‌కు రావాల్సిన రూపాయిలో 70 పైస‌ల‌కు సెటిల్‌మెంట్ చేసుకోమ‌ని ర‌ఘురామ‌కు చెప్పిన‌ట్లు తెలిపారు. అయితే త‌మిళ‌నాడులో ఎన్నిక‌లు రావ‌డం వ‌ల్ల అది పెండింగ్‌లో ప‌డింద‌ని చెప్పారు. మ‌రి ఇప్పుడు ఆ అమౌంట్ ర‌ఘురామ‌కృష్ణం రాజుకు వ‌చ్చిందా లేదా అన్న‌ది తెలియ‌దు. ఆయ‌న‌కు డ‌బ్బులు వ‌చ్చింటే ఇప్పుడు చంద్ర‌బాబు గురించి ఆలోచించి ఉండేవారు కాద‌ని రాజ‌కీయ మేధావులు అంటున్నారు.

ర‌ఘురామ‌కృష్ణం రాజు బ్యాంకుల‌కు క‌ట్టాల్సిన వంద‌ల కోట్ల రూపాయ‌ల కేసు ఇంకా న‌డుస్తూనే ఉన్నందున కేసుల రారాజు అయిన చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేసేందుకు ఆరాట ప‌డుతున్నార‌ని ఏపీలో చ‌ర్చ సాగుతోంది. ఎందుకంటే ఎన్ని కేసులు ఉన్నా వాటిని విచార‌ణ‌కు రాకుండా చంద్ర‌బాబు మ్యాజిక్ చేస్తార‌ని ర‌ఘురామ కూడా గ్ర‌హించిన‌ట్లున్నారు. అందుకే చంద్ర‌బాబును మ‌చ్చిక‌చేసుకొని వంద‌ల కోట్ల సీబీఐ కేసులో కూడా కాల‌యాప‌న చేయాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. కేవ‌లం కేసుల నుంచి తప్పించుకునేందుకే ఈయ‌న చంద్ర‌బాబును పొగుడుతూ.. సీఎం జ‌గ‌న్‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌న్న విమ‌ర్శ‌లు మ‌ట‌గ‌ట్టుకుంటున్నారు.

మ‌రి నిజంగా ర‌ఘురామ‌కృష్ణంరాజు పార్టీ మారితే క‌చ్చితంగా బీజేపీలో చేర‌తార‌ని అనుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీలో చేరిన ఎంతో మంది టిడిపి ఎంపీలు ఆయ‌న‌కు సుప‌రిచితులే. దీంతో ఎలాగైనా వంద‌ల కోట్ల సీబీఐ కేసు నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చంద్ర‌బాబు ఎలాగోలా లైన్ చేస్తాడ‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఏమ‌వుతుందో వేచి చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here