తెలుగులో ‘లస్ట్ స్టోరీస్’.. !

బాలీవుడ్ లో తెరకెక్కిన లస్ట్ స్టోరీస్.. ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ మంచి ఆదరణ సంపాదించుకుంది. నలుగురు అమ్మాయిల కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను నలుగురు దర్శకులు తీశారు. సహజత్వానికి దగ్గరగా ఉన్న ఈ సిరీస్ డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే ఈ సిరీస్ ను తెలుగులోనూ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు కథల చిత్రీకరణ పూర్తయింది. అయితే హిందీ కథ కాకుండా.. నాలుగు కొత్త కథలతో ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. వీటిలో ఇప్పటికే పూర్తయిన మూడు కథలకు సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక మరో కథ పూర్తయ్యాక ఈ సిరీస్ ను విడుదల చేయనున్నారు… అయితే ఈ నాలుగో కథకు నాగ అశ్విన్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది.

కరోనా కారణంగా ఈ షూటింగ్ వాయిదా పడిందని సమాచారం. ఇక నందిని రెడ్డి దర్శకత్వం వహించిన కథలో అమలాపాల్, సంకల్ప్ రెడ్డి తీసిన కథలో ఈషా రెబ్బ నటించారు. మరి ఈ  శృంగార చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here