చంద్ర‌బాబు నాయుడు చ‌ట్టాల‌కు అతీత‌మా..?

ఏపీ రాజ‌కీయాల్లో ఆయ‌న పేరొందిన నాయ‌కుడు. అయితే ఇది ఒక‌ప్ప‌టి మాట ఇప్పుడంతా ఆయ‌న్ను స్టేల నాయ‌కుడు అంటున్నారు. ఇదంతా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు గురించే. ఏపీ సీఎంగా ప‌నిచేసిన ఈయ‌న దానికంటే స్టేలు తెచ్చుకోవ‌డంతోనే ఫేమ‌స్ అయ్యార‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులంటుంటారు. ఒక్క‌సారి కేసుల విష‌యానికొస్తే చంద్ర‌బాబు ఏ దారిలోనైనా వెళ్లి కోర్టు కేసుల‌లో విచార‌ణ జ‌ర‌గ‌కుండా తెచ్చుకోగ‌ల ద‌మ్మున్న నేత అంటారు. అందుకే ఇప్పుడు ఏ రాజ‌కీయ నాయ‌కుడు కేసుల్లో ఇరుక్కున్నా చంద్ర‌బాబు లాగా ఆలోచించడం మ‌న‌కు రాదు అంటారు. అంటే ఆ స్థాయికి చంద్ర‌బాబు ఎదిగిపోయారు.

చంద్ర‌బాబునాయుడు అక్ర‌మ ఆస్తులు క‌లిగి ఉన్నాడ‌ని ల‌క్ష్మీప‌ర్వాతి కేసు వేశారు. ఆయ‌న ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని ఆమె ఆరోపించారు. 2004 ఎన్నిక‌ల్లో ఆయ‌న చూపించిన ఎన్నిక‌ల‌ అఫిడ‌విట్‌కు సంబంధించి 2005లో ఆమె కేసు వేశారు. ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు చంద్ర‌బాబు ఇచ్చిన అఫిడ‌విట్లోని అదాయ‌పు వివ‌రాలు, ఆయ‌న వ్యాపారాల వివ‌రాలు, కుటుంబ స‌భ్యుల వివ‌రాలు ఆమె బ‌య‌ట పెట్టారు. అన్ని వ్యాపారాల్లో న‌ష్టాలు చూపిస్తున్న చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబం ఆస్తుల్లో మాత్రం ఎలా పెరిగిపోతుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. 1978 నుంచి 2005 వ‌ర‌కు చంద్రబాబు ఆస్తుల‌న్నీ ల‌క్ష్మీపార్వ‌తి కోర్టుకు అంద‌జేశారు. ఆ కేసు ఇప్ప‌టికే ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు విదేశాల్లో 25వేల కోట్లు దాచిపెట్టార‌ని ల‌క్ష్మీ పార్వ‌తి చెబుతారు. . సీఎంగా ఉన్న‌ప్పుడు చంద్రబాబు నాయుడు ఆరు నెల‌ల‌కోసారి విదేశాల‌కు వెళ్తార‌ని.. అయితే ఆయ‌న వెళ్తున్న‌ప్ప‌డు ఎయిర్‌పోర్టులో కొన్ని సూటుకేసులు తీసుకొని ఆయ‌న మ‌నుషులు వెళ్తారు. అయితే సీఎం కాబ‌ట్టి దీన్ని త‌నిఖీలు చేయ‌కుండా పంపించేస్తారు. ఇలా చంద్ర‌బాబు వెళ్లిన‌ప్పుడ‌ల్లా కోట్ల‌లో డ‌బ్బులు తీసుకెళ్తార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

చంద్ర‌బాబుపై ఇప్ప‌టివ‌ర‌కు 17 కేసులు న‌మోద‌య్యాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకొని చంద్ర‌బాబు చేసిన ప‌నులు, అక్ర‌మాస్తుల‌పై ఈ కేసులు న‌మోద‌య్యాయి. 1998 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వేర్వేరు వ్య‌క్తులు వేర్వేరు సంద‌ర్బాల్లో ఈ కేసులు వేశారు. అయితే ఈ కేసుల‌ను కోర్టులు కొట్టివేశాయ‌ని చంద్రబాబుతో పాటు టిడిపి నేత‌లు చెబుతుంటారు. కానీ ఆ కేసుల్లోని లొసుగుల‌ను తెలుసుకొని కేసుల ద‌ర్యాప్తు ముందుకు క‌ద‌ల‌కుండా చంద్రబాబు చేసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు దాఖ‌లైన 17 కేసుల్లో 14 కేసులు వేర్వేరు కార‌ణాల‌తో ముందుకు వెళ్ల‌లేదు. కొన్ని కేసుల్లో దర్యాప్తు జ‌ర‌గ‌కుండా చంద్ర‌బాబు స్టేలు తెచ్చుకున్నారు.

ఒక్క‌సారి చంద్ర‌బాబు కేసుల వివ‌రాలు ప‌రిశీలిస్తే చంద్ర‌బాబు ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని ఓ కేసును వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఫైల్ చేశారు. ఆయ‌న ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని ద‌ర్యాప్తు చేయాల‌ని కోరారు. ఈ కేసును 1999లో డివిజ‌న్ బెంచ్ డిస్మిస్ చేసింది. 2000 సంవ‌త్స‌రంలో ఈ కేసుకు సంబంధించి స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ ను డిస్మిస్ చేసింది.

ఇక 1997లో ఒక కేసు న‌మోదైంది. కాంగ్రెస్ నేత ఆర్‌.నాయ‌క్ ఎన్‌.టి.ఆర్ ట్ర‌స్టుకు సంబంధించిన ల్యాండ్స్‌పై వేసిన కేసు 1998లో కొట్టి వేశారు. ఆయ‌న ఆయ‌న వెంట‌నే సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి ఎస్‌.ఎల్‌.సి వేశారు. సుప్రీంకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును స‌మ‌ర్ధిస్తూ కొట్టివేసింది.

ఆ త‌ర్వాత‌ చంద్ర‌బాబు కుటుంబ ఆస్తుల‌పై సీబీఐతో ఎంక్వైరీ చేయాల‌ని రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌రో పిటిష‌న్ వేశారు. దీన్ని 2000 సంవ‌త్స‌రంలో డివిజ‌న్ బెంజ్ డిస్మిస్ చేసింది. ఈ కేసును రాజ‌శేఖ‌ర్ రెడ్డి విత్ డ్రా చేసుకున్నారు.

అయితే చంద్ర‌బాబు ఆస్తుల‌పై సీబీఐతో విచార‌ణ చేపించాల‌ని రాజ‌శేఖ‌ర్ రెడ్డి తో పాటు 40 మంది కాంగ్రెస్ నేత‌లు వేసిన పిటిష‌న్ల‌ను 2000 సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 10వ తేదీన‌ కోర్టు కొట్టివేసింది. 1999లోనే దీనిపై 7 పిటిష‌న్లు వేశారు.

ఆ తర్వాత వై.ఎస్‌ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌రో పిటిష‌న్ వేశారు. చంద్రబాబు ఆదాయం, ఎన్‌.టి.ఆర్ ట్ర‌స్టుకు ల్యాండ్స్ కేటాయించ‌డంపై వేసిన పిటిష‌న్‌ను 2001 మార్చి 29న ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది.

2003లో క్రిష్ణ‌కుమార్ గౌడ్ అనే వ్య‌క్తి ఓ కేసు వేశారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు లిక్క‌ర్ కొనుగోళ్ల‌పై ఆయ‌న కేసు వేశారు. 2003 డిసెంబ‌ర్ 22న ఇది కొట్టివేసింది కోర్టు. అయితే ఇదే కేసును మళ్లీ సుప్రీంకోర్టులో వేశారు. 2010లో సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టి వేసింది.

ఆ త‌ర్వాత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు 2003లో చంద్రబాబు ఆస్తుల‌పై పిటిష‌న్ వేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న దీన్ని 2004 జ‌న‌వ‌రిలో విత్ డ్రా చేసుకున్నారు.

ఆ త‌ర్వాత కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ 2004లోనే ఓ రిట్ పిటిష‌న్ వేశారు. హెరిటేజ్ ఫూడ్స్‌తో పాటు ఎన్టీఆర్ ట్ర‌స్టు భ‌వ‌న్ పై సీబీఐ ఎంక్వైరీ కావాల‌ని ఆయ‌న వేశారు. అయితే ఇవే అంశాలు పేర్కొంటూ ప‌దే ప‌దే వేసిన పిటిష‌న్ల‌ను విచార‌ణ బృందాల‌కు స‌బ్మిట్ చేయ‌డంలో పిటిష‌నర్లు ఫెయిల‌య్యార‌ని.. మ‌ళ్లీ అదే ఆరోప‌ణ‌తో ఇప్పుడు ఈ పిటిష‌న్ వేశార‌ని కోర్టు ఈ పిటిష‌న్‌ను డిస్మిస్ చేసింది.

ఆ త‌ర్వాత 2004లో కాంగ్రెస్ నేత ప‌ల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి కేసు వేశారు. ఐ.ఎంజి భార‌త్‌కు ల్యాండ్స్ కేటాయింపుల విష‌యంలో చంద్రబాబు పాత్ర ఉంద‌ని ఆయన కేసు వేశారు. అయితే ఈ కేసును ఏసీబీ కోర్టు కొట్టి వేసింది.

పాల్వార్ గోవ‌ర్ద‌న్ రెడ్డి ఇదే అంశంపై ఇంకో కేసు వేశారు. దీన్నిహైకోర్టు డిస్మిస్ చేసింది. ‌

ఇక 2005లో లక్ష్మీ పార్వ‌తి చంద్ర‌బాబు ఆస్తుల‌పై ఏసీబీతో విచార‌ణ జ‌రిపించాల‌ని రిట్ పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసుపై అప్ప‌ట్లో స్టే ఇచ్చినా ఆ త‌ర్వాత స్టే వెకెట్ చేశారు. ప్ర‌స్తుతం ఇది విచార‌ణ జ‌రుగుతోంది.

ఆ త‌ర్వాత 2011లో ఎం.ఆర్ కుంభ‌కోణంలో చంద్ర‌బాబు పాత్ర‌పై కేసు వేశారు.  ఈ కేసును కూడా సెప్టెంబ‌ర్ 9, 2011లో కోర్టు కొట్టి వేసింది.

పి.జే.ఆర్ కూడా చంద్రబాబుపై సోమశేఖ‌ర క‌మీష‌న్ విష‌యంలో కేసు వేశారు. దీన్ని కూడా కోర్టు కొట్టి వేసింది.

మొత్తంగా చూస్తే ఇవే కాకుండా చంద్ర‌బాబువి ఇంకా చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న ఈ కేసుల‌న్నింటిపై చంద్ర‌బాబు నాయుడును విచారించాల‌ని పిటిష‌న్లు వేసినా అవి విచార‌ణ‌కు రాలేదు. వీట‌న్నింటిని కోర్టులు కొట్టివేశారు. హైకోర్టులో కొట్టివేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టులో వేస్తే అక్క‌డ కూడా కొట్టి వేయ‌డం జ‌రిగింది. ల‌క్ష్మీపార్వ‌తి వేసిన కేసు మాత్రం ఇప్పుడు విచార‌ణ జ‌రుగుతోంది. మ‌రి ఈ కేసు ఏమ‌వుతుందో చూడాలి. ఏదిఏమైనా చంద్ర‌బాబు నాయుడు కేసుల‌ను ఎదుర్కోలేక స్టేలు తెచ్చుకుంటార‌న్న ఆరోప‌ణ‌లు ఇప్ప‌టివి కాదు. అయితే ఆయ‌న న్యాయ వ్య‌వ‌స్థ‌లోని లొసుగుల‌తో కేసుల‌ను కొట్టివేయించుకొని బ‌య‌ట తిరుగుతున్నార‌ని ఆయ‌న ప్ర‌త్యర్థులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కులు కూడా కోర్టు కేసుల విష‌యంలో చంద్ర‌బాబు స‌ల‌హాలు తీసుకుంటున్నార‌న్న పుకార్లు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు చెంత‌న ఉంటే కోర్టుల్లో త‌ప్పించుకోవ‌చ్చన్న భావ‌న వారిలో ఏర్ప‌డింద‌ని చెబుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here