గాంధీ జ‌యంతి రోజు రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గాంధీ జ‌యంతి సంద‌ర్బంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఉత్త‌రప్ర‌దేశ్‌లో హ‌థ్రాన్ బాదితురాలి కుటుంబాన్ని రాహుల్ ప‌రామ‌ర్శించేందుకు వెళుతున్న స‌మ‌యంలో ఆయ‌న్ను అడ్డుకున్న విష‌యం తెలిసిందే. దీంతో నేడు రాహుల్ కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారాయి.

తాను పోరాడ‌తాన‌ని రాహుల్ అన్నారు. ప్ర‌జ‌ల కోసం పోరాడే క్ర‌మంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా త‌ట్టుకుంటాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇంకేమ‌న్నారంటే.. ఈ ప్ర‌పంచంలో తాను ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని రాహుల్ అన్నారు. ఎవ్వ‌రికీ త‌ల వంచ‌న‌న్నారు. స‌త్యానికి ఉన్న శ‌క్తితో అస‌త్యాల‌ను జ‌యిస్తాన‌ని రాహుల్ పేర్కొన్నారు. ఈ మాట‌లు ప్ర‌ధానంగా నిన్న రాహుల్‌తో పాటు ప్రియాంక‌ల‌ను అడ్డుకోవ‌డానికి కౌంట‌ర్‌గానే భావించొచ్చ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. బాదిత యువ‌తి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళితే పోలీసులు రోడ్డుపైనే వీరిని అడ్డుకున్నారు.

దీనిపై రాహుల్ కూడా తీవ్రంగా ప్ర‌తిఘ‌టించారు. త‌న‌పై లాఠీ చార్జ్ చేశార‌నిన ఆయ‌న మండిప‌డ్డారు. ఓ క్ర‌మంలో రాహుల్ కింద ప‌డిపోయార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల బీజేపీపై ఆయ‌న చాక‌చ‌క్యంగా మాట్లాడుతున్నారు. ఇదే పంథాను కొన‌సాగిస్తే రాబోయే ఎన్నిక‌ల్లో ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న అభిప్రాయం ప‌లువురు నుంచి వ్య‌క్తమ‌వుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here