విజ‌య‌సాయిరెడ్డికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిందా… లేదా..?

వైసీపీ నేత విజ‌యసాయిరెడ్డికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌న్న ప్ర‌చారం ఊపందుకున్నాయి. ఆయ‌న హాస్పిటల్‌లో చేరార‌ని సోష‌ల్ మీడియాలో నిన్న‌టి నుంచి వార్త‌లు గుప్పుమంటున్నాయి.

అయితే విజ‌యసాయి రెడ్డి చేసిన ట్వీట్ వ‌ల్లే ఇదంతా జ‌రుగుతున్న‌ట్లు అర్థం చేసుకోవ‌చ్చు. ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ఏమ‌న్నారంటే ప్ర‌స్తుతం ఉన్న కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంతో జాగ్ర‌త్త‌ల కోసం నా అంత‌ట నేను వారం ప‌ది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల‌నుకుంటున్నా అని అన్నారు. ఏదైనా అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఫోన్ లో కూడా అందుబాటులో ఉండ‌న‌ని చెప్పారు.

దీన్ని బ‌ట్టి విజ‌యసాయిరెడ్డికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నార‌ని చెబుతున్నారు. కాగా ఆయ‌న మాత్రం పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు చెప్ప‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here